తెలంగాణ ప్రభుత్వం భారీగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. అర్హత ప్రమాణాలు దరఖాస్తు తేదీలు ఇక్కడ. MHSRB Opening 1623 New! Vacancies Apply here
నిరుద్యోగులకు శుభవార్త !
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి భారీగా నోటిఫికేషన్లను విడుదల చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 33 జిల్లాలలో ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు పరిధిలో ని 1623 మెడికల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ లోని Annexure -1ను తనిఖీ చేయండి. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 23-09-2025 సాయంత్రం 05:00 గంటలకు ముగియనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, గౌరవ వేతనం, ఎంపిక విధానం, వయోపరిమితి మొదలగు పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య :-1624
పోస్ట్ పేరు :- సివిల్ అసిస్టెంట్ సర్జన్.
- మల్టీ జోన్ -1, మల్టీ జోన్ -2 పరిధిలో నీ ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లోమా/ డి ఎన్ బి లో అర్హత సాధించి ఉండాలి.
- అకాడమిక్ విద్య అర్హతలు కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :-
- 01-07-2025 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :-
- అభ్యర్థులకు 100 పాయింట్లు ఆధారంగా ఎంపికలు చేస్తారు.
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అకాడమిక్/టెక్నికల్ విద్య అర్హతలు కనపరిచిన మార్కుల మెరిట్ ఆధారంగా నియామకాలు ఉంటాయి.
- అర్హత పరీక్షలు కనపరిచిన ప్రతిభాకు గరిష్టంగా 80 పాయింట్లు.
- రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపాదికన సేవలందించినందుకు 20 పాయింట్లు.
- గిరిజన ప్రాంతాలలో అందించిన సేవలకు 6 నెలలకు 2.5 పాయింట్లు.
- పట్టణ/ఇతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 ఆరు నెలలకు 2 పాయింట్లో చొప్పున లెక్కిస్తారు.
- రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, లోకల్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- తుది ఎంపిక జాబితా అధికారిక వెబ్సైట్ నందు ప్రకటిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :-
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ లకు రూ.58,850/- నుండి రూ.1,37,050/-,
- మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ లకు రూ.56,500/- నుండి రూ.1,31,000/- వరకు ప్రతినెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :-
- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు కింద ప్రతి దరఖాస్తుదారు రూ.500/-చెల్లించాలి.
- అలాగే ప్రాసెసింగ్ పరీక్ష ఫీజు క్రింద రూ.200/-చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఈ డబ్ల్యూ ఎస్, దివ్యాంగులు మరియు తెలంగాణ రాష్ట్రం మాజీ సైనికులు అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి అధికార వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :- https://mhsrb.telangana.gov.in/MHSRB/
- అధికారిక హ్యూమ్ పేజీలోని Apply Online లింక్ పై చేయండి.
- సంబంధిత దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
- వ్యక్తిగత, విద్యా అర్హత వివరాలను నమోదు చేస్తూ దరఖాస్తు పేజీ చెల్లించి, ఫోటో, సిగ్నేచర్ మరియు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను అప్లోడ్ చేసి, దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
సందేహాలను నివృతి కోసం కామెంట్ సెక్షన్ లో మీ సందేహాలను కామెంట్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ :- 08-09-2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 23-09-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://mhsrb.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment