SSC CGL & CHSL JOBs Recruitment 2021 and FREE ONLINE COACHING to ST, SC, BC Candidates for SSC CGL & CHSL Applicants.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సిజీఎల్)-2020 వివిధ రకాల విభాగాల్లో 6056 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన వారు మరియు అర్హత ఆసక్తి అభ్యర్డులు ఈ ఉద్యోగాలకు 31 జనవరి 2021 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పరిక్షకు దరఖాస్తు చేసుకునే ST, SC, BC అభ్యర్డులు ఉచిత శిక్షణ కోసం తెలంగాణ స్టడీ పోర్టల్ లో దరఖాస్తు చేసుకునే పూర్తి విదానం వీడియో
4ఖాళీలు:
= గ్రూప్-బి కేడర్
లో గెజిటెడ్: 250
= గ్రూప్-బి నాన్ గెజిటెడ్: 3513
= గ్రూప్-సి కేడర్ లో: 2743
= మొత్తం: 6506
👉తప్పక చదవండి :👇👇👇
👉 Latest Jobs Notifications-2021:🔔 Click here NEW
👉 Latest Admissions Notifications-2021:🔔 Click here NEW
4పోస్టులు:
1.
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్,
2.
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్,
3.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,
4.
ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్,
5.
జూనియర్ స్టాటి స్టికల్ ఆఫీసర్,
6.
ఆడిటర్,
7.
అకౌంటెంట్,
8.
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్,
9.
టాక్స్ అసిస్టెంట్,
10.
సబ్ ఇన్స్పెక్టర్ మొదలగు విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు అదికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
4అర్హత:
=అసిస్టెంట్ ఆడిట్ఆఫీసర్ మరియు అసిస్టెంట్అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు -
డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంబీఏ (ఫైనాన్స్), ఎంకాం, పీజీ (బిజినెస్ స్టడీస్/బిజినెస్ ఎకనామిక్స్) పూర్తి చేసి ఉండాలి.
= జూనియర్ స్టాటి స్టికల్ ఆఫీసర్లకు-
ఇంటర్ స్థాయిలో మేథ్స్ లో 60 శాతం మార్కులు సాధించి ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులు.
లేదా స్టాటిస్టిక్స్ ప్రధాన సుబ్జెక్టు గా డిగ్రీ చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
= మిగిలిన అన్నీ పోస్టులకు జనవరి 1, 2021 నాటికి “గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టి ట్యూట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న వారు అర్హులు.
4 సెలెక్షన్ ప్రాసెస్:
::పరీక్ష విధానం::
ఇందులో టయర్ 1, 2, 3, 4 పరీక్షలు ఉంటాయి.
మొదటి, రెండు టెస్ట్ లను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు.
అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
మూడోది డిస్కి ప్టివ్ టెస్ట్.
నాలుగోది లో కంప్యూటర్ ప్రోఫీకియెన్సీ టెస్ట్/డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటాయి.
ఆన్లైన్ ఎగ్జామ్లో నెగెటివ్ మార్క్స్ ఉంటాయి.
4 టైర్ 1 పరీక్ష:
ఈ పేపర్ ను నాలుగు విభాగాలుగా చేసి ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు.
1.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రేజనింగ్,
2.
జనరల్ అవేర్ నెస్
3.
క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్
4.
ఇంగ్లిష్ కొంప్రహేన్సస్ తో
ఆబ్జెక్టివ్ తరహాలో మల్టిపుల్ ఛాయిస్ విధానంలో పరీక్ష జరుగుతుంది.
ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి.
ప్రతి ప్రశనకు 2 మార్కుల చొప్పున మొత్తం మార్కులు 200.
తప్పుగా గుర్తిస్తే ½ మార్కు కట్ చేస్తారు.
పరీక్ష సమయం 60 నిమిషాలు.
టైర్ 1 లో అర్హత పొందిన వారికి మాత్రమే టైర్ 2 కు అనుమతిస్తారు.
4 టైర్ 2 పరీక్ష:
ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి.
మొదటి పేపర్ 10వ తరగతి స్తాయి లో,
రెండో పేపర్ ఇంటర్ స్తాయి లో, మిగిలినవి డిగ్రీ స్తాయి లో ఉంటాయి.
4పేపర్ 1. క్వాంటిటివ్ ఎబిలిటీస్ 100 మార్కులకు
4పేపర్ 2. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 200 మార్కులకు
4పేపర్ 3. స్టాటిస్టిక్స్ 100 మార్కులకు
4పేపర్ 4. జనరల్ స్టడీస్ (ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ విభాగాల నుంచి) 100 మార్కులు ఉంటాయి.
పేపర్ 2, అనగా ఇంగ్లిష్ మినహా అన్ని పేపర్లు ఆబ్జెక్టివే, మల్టిపుల్ చాయిస్ విదానంలో ఉంటాయి.
ఒక్కొక్క పేపర్ కు పరీక్ష సమయం 2 గంటలు
ఉంటుంది.
ఇక్కడ కూడా సమాదానాలను తప్పుగా గుర్తిస్తే ఇంగ్లిష్ లో ¼ మార్కు, మిగిలిన పేపర్లలో ½ మార్కు కట్ చేస్తారు.
మొదటి రెండు పేపర్లు అందరూ రాయాలి.
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు స్టాటిస్టిక్ పేపర్ ను, అనగా పేపర్ 3 ను
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు జనరల్ స్టడీస్ పేపర్ ను కూడా రాయాలి.
టైర్ 2 లో అర్హత పొందిన వారికి మాత్రమే టైర్ 3 కు అనుమతిస్తారు.
4 టైర్ 3 పరీక్ష:
ఇది డిస్కిప్టివ్ విధానంలో జరిగే పరీక్ష.
ఎస్సే రైటింగ్. ప్రిసీస్,
లెటర్,
అప్లికేషన్ తదితరాలపై ప్ర శ్నలు ఉంటాయి.
అభ్యర్డులు ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో పరీక్ష రాయవచ్చు.
పరీక్ష సమయంలో 1 గంట. 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.
4 టైర్ 4 పరీక్ష:
ఇది స్కిల్ల్ టెస్ట్.
అభ్యర్థి ఎంపిక చేసుకున్నా ఉద్యోగాన్ని అనుసరించి వేరు వేరుగా నిర్వహిస్తారు.
అభ్యర్థులకు ఉన్న కంప్యూటర్, నాలెడ్జ్ను పరీక్ష చేస్తారు.
టాక్స్ అసిస్టెంట్లకు డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుంది.
అభ్యర్డుకు కంప్యూటర్ మీద గంటకు 8000 ‘కీ’ ల వేగం తో 15నిముషాలలో 2000 ‘కీ’ డిప్రెషన్స్ ఉన్న ప్యాసేజిని పూర్తి చేయాలి.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్లు ఇన్ స్పెక్టర్ లకు కంప్యూటర్ ప్రోఫీకియెన్సీటెస్ట్ నిర్వహిస్తారు.
ఇందులో వర్డ్ ప్రొసెసింగ్, స్ప్రెడ్ షీట్ జనరేషన్ ఆఫ్ స్లైడ్స్ అంశాలపై పరీక్ష ఉంటుంది.
ఒక్కొక్కడానికి 15 నిమిషాల సమయం ఇస్తారు.
👉 ఇది కూడా చదవండి : 2021 ఉద్యోగ నోటిఫికెషన్స్
4 ముఖ్యసమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో అపై చేసుకోవాలి.
4అపికేషన్ ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.100,
మహిళలు/ఎస్సీ/ ఎన్టీ/ ఎక్స్ సర్వీస్మెన్మరియు దివ్యాంగ అభ్య ర్హులకు ఫీజులేదు.
4 ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభం: 29 డిసెంబర్ 2020 నుండి
4 దరఖాస్తులకు చివరితేది: 31జనవరి 2021
4 ఆన్లైన్ పేమెంట్ చివరి తేది: 2 ఫిబ్రవరి 2021
4 టైర్-1 ఎగ్జామ్: 29 మే 2021 నుంచి 7 జూన్ 2021 వరకు.
4 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
తెలంగాణ లో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్.
ఆంధ్రప్రదేశ్ లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్టణం మొదలగునవి.
4 అధికారిక వెబ్ సైట్: https://ssc.nic.in/
4 ఉచిత శిక్షణ దరఖాస్తు వెబ్ సైట్: : https://studycircle.cgg.gov.in/
Comments
Post a Comment