SCCL JOBS 2022 | సింగరేణి సంస్థలో 655 బదిలీ వర్కర్ (అండర్ గ్రౌండ్), సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీల ప్రకటన..
సింగరేణి సంస్థలో 655 బదిలీ వర్కర్ (అండర్ గ్రౌండ్) షెడ్యూల్ తెగల అభ్యర్థుల ఖాళీలు నింపుట కై 10.06.2018 నా సింగరేణి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాతపరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 27279 అభ్యర్థులు హాజరయ్యారు.. దీనికి సంబంధించిన ఫలితాలను తాజాగా 06.05.2022 నాడు వెల్లడించడం జరిగింది. అలాగే షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థుల మెరిట్ జాబితాను 655 బదిలీ వర్కర్ (అండర్ గ్రౌండ్) పోస్టుల ఆధారంగా మెరిట్ లిస్ట్ నో అధికారిక వెబ్సైట్ నందు పొందుపరచడం జరిగింది.
సింగరేణి సంస్థలో 655 బదిలీ వర్కర్ (అండర్ గ్రౌండ్) ఉద్యోగ నియామకాల లో భాగంగా సెలెక్టెడ్ అభ్యర్ధుల యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన వచ్చేనెల ఆరవ తేదీ నుండి 11వ తేదీ వరకు రోజుకు 120 అభ్యర్థుల చొప్పున సింగరేణి, ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఏర్పాటు చేయడమైనది.. ఇట్టి సమాచారం మేరకు అభ్యర్థులు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని.. దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు సెలెక్టెడ్ అభ్యర్థుల ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ ను రిజిస్టర్ పోస్టు ద్వారా సమాచారాన్ని అందజేసి ఒరిజినల్ సర్టిఫికెట్లతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావలసిందిగా కోరడమైనది.. అలాగే రిజిస్టర్ మొబైల్ నెంబర్ లకు కూడా సమాచారం పంపడం జరిగిందని సంస్థ డైరెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.
పై సమాచారం మేరకు సెలెక్టెడ్ అభ్యర్థులు తమ 10వ తరగతి మార్కుల మెమో, 4వ తరగతి నుండి 19వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, రీసెంట్ గా పొందినటువంటి కుల ధ్రువీకరణ పత్రము ఆధార్ కార్డు మరియు ఇతర ID కార్డులు మరియు పని పాస్పోర్ట్ సైజు ఫోటోలను తమ వెంట తీసుకొని అపాయింట్మెంట్ ఆర్డర్ తో పైన తెలిపిన తేదీలలో రిక్రూట్మెంట్ విభాగం హెడ్ ఆఫీస్ కొత్తగూడెం నందు నిర్వహించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని తెలిపారు..
ఇంటర్ తో 248 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు
నోటిఫికేషన్ వివారాలు @59 సెకన్లలో మీకోసం..
అధికారిక ప్రకటన:
సింగరేణి సంస్థలో 655 (బదిలీ వర్కర్) అండర్ గ్రౌండ్ సెలక్షన్ లిస్ట్ పిడిఎఫ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
సూచన :: ఈ నీటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment