NIMS 200 Staff Nurse Recruitment 2022 | నిమ్స్ రూ.32,682 జీతంతో 200 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.
నిరుద్యోగులకు శుభవార్త!
హైదరాబాదులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(NIMS) రాష్ట్రంలోని, బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి రూ.32,682/-జీతంతో స్టాఫ్ నర్స్(Staff Nurse) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 6, 2022 సాయంత్రం ఐదు గంటల వరకు సమర్పించి, హాట్ కాపీలను సెప్టెంబర్ 10, 2022 నాటికి చేరేలా ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ ఆఫీస్, 2వ అంతస్తు, ఓల్డ్ ఓ పి డి బ్లాక్, నిమ్స్ పంజాగుట్ట, హైదరాబాద్-500082, స్వయంగా లేదా పోస్టు ద్వారా అందించాలని నోటిఫికేషన్లో సూచించారు.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బీఎస్సీ (నర్సింగ్) లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18 నుండి ముప్పై నాలుగు సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే. హైదరాబాద్ లో ఖాళీలు..
ఎంపిక విధానం:
రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో/ ఆఫ్లైన్ లో సమర్పించాలి.
సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2(External) హాల్ టికెట్లు విడుదల..
దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.1000/-.
◆ రిజర్వేషన్ వర్గాలవారికి రూ.500/-







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.08.2022 నుండి..
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06.09.2022 సాయంత్రం 05:00 గంటల వరకు
హార్డ్ కాపీలు సమర్పించడానికి చివరి తేదీ : 10.09.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్: https://nims.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment