TS Free Driving License Recruitment 2022 | ఉచిత డ్రైవింగ్ శిక్షణ కొరకు దరఖాస్తులు ఆహ్వానం.. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ శాఖ మహబూబాబాద్ జిల్లా, తేదీ:25.08.2022 న జిల్లాలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఈ.జి.యం.యం రాజన్న సిరిసిల్ల జిల్లా వారి సపోర్టుతో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ద్వారా 90 రోజులపాటు ఉచిత డ్రైవింగ్ శిక్షణ లకు ఆసక్తి కలిగిన అభ్యర్థులకు నేరుగా ఈనెల 26, 29 న సర్టిఫికెట్లు పరిశీలించి ఎంపిక చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు:
◆ పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్,
◆ అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మించకూడదు.
◆ అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి.
◆ ఎత్తు 160 సెంటీమీటర్ల కు తగ్గకూడదు.
◆ శిక్షణ అనంతరం ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.
పై అర్హతలు కలిగిన అభ్యర్థులు నేరుగా 29న (29.08.2022) అర్హత ధ్రువపత్రాలు, మరియు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, తీసుకొని జిల్లా ఉపాధి కార్యాలయంలో సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధి అధికారి నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు.
ఈ శిక్షణ కాలం 90 రోజులు, ఇందులో 60 రోజులు సిరిసిల్ల ఇన్స్టిట్యూట్ నందు, మరియు మిగిలిన 30 రోజులు అప్రెంటిస్షిప్ లైట్ మోటర్ వెహికల్ లైసెన్స్ 1 సంవత్సరం పూర్తి అయి ఉన్న వారికి హెవీ మోటార్ వెహికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు.. అలాగే ఏ విధమైన లైసెన్స్ లేని వారికి లైట్ మోటార్ వెహికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
*ఉచిత డ్రైవింగ్ శిక్షణలకు దరఖాస్తులు ఆహ్వానం*
— Dasarath M (@LearningBADI) August 28, 2022
*శిక్షణా అనంతరం ఉద్యోగం*
*రేపే ఇంటర్వ్యూలు..*
*పూర్తి వివరాలు👇*
*https://t.co/OWsLmY1Fwh*
*Thanks for sharing🙏* pic.twitter.com/r1BU5ZfnK0
మరిన్ని వివరాలకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గరలోనే జిల్లా ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి మహబూబాబాద్ వారు సూచనలు చేశారు..







సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment