Metro Railway 125 Vacancies Notification | మెట్రో రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీ | Apply here..
![]() |
Metro Railway 125 Vacancies Notification Apply here.. |
10+2 అర్హత తో NCVT - ITI సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
మెట్రో రైల్వే కలకత్తా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 125 అప్రెంటిస్ శిక్షణ ఖాళీల కోసం అప్రెంటిస్ యాక్ట్ 1961 మరియు అప్రెంటిస్ రూల్ 1962 ప్రకారం ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ శిక్షణను పూర్తి చేయడానికి అధికారి నోటిఫికేషన్ లోనే దరఖాస్తు ఫామ్ ను స్వయంగా తమ చేతి రాతతో పూర్తి చేసి, సంబంధిత చిరునామాకు చివరి తేదీ కు ముందుగా చేరేలా పోస్ట్ ద్వారా పంపించాలి. మహిళా పురుష అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తిచేసినవారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగం నోటిఫికేషన్లో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జారీ చేయబడినవి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 125.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ఫిట్టర్ - 81,
- ఎలక్ట్రీషియన్ - 26,
- మెకానిస్ట్ - 09,
- వెల్డర్ - 09.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి (10+2)/ ఇంటర్మీడియట్ అర్హత కలిగి, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(NCVT) ITI అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
వయోపరిమితి:
- 01.01.2023 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు.
- ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు.
- దివ్యాంగులకు 10 నుండి 15 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
- అలాగే మాజీ సైనికులకు 40 సంవత్సరాల వరకు వర్తిస్తుంది..
ఎంపిక విధానం:
- అకడమిక్ విద్యార్హత/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం గౌరవ వేతనం ప్రతినెలా స్కాలర్షిప్పులు రూపంలో చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
- సీనియర్ పర్సనల్ ఆఫీసర్, మెట్రో రైల్ వే, మెట్రో రైల్వే భవన్ ,33/1, జై.ఎల్. నెహ్రూ రోడ్, కలకత్తా-700071.
అధికారిక నోటిఫికేషన్ / దరఖాస్తు ఫారం :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.03.2023.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment