ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ & జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులను సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు సబ్జెక్టుల వారీగా ఖాళీలతో మీ కోసం ఇక్కడ.
Guest Faculty Recruitment 2025 Apply here..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
కాలేశ్వరం జోన్ లోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక ఆధ్యాపకుల మరియు ఉపాధ్యాయుల భర్తీకి ప్రకటన.
కాలేశ్వరం జోన్లో గల అసిఫాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు మరియు భూపాలపల్లి జిల్లాలలోని 25 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మరియు జూనియర్ కళాశాలలో (బాలుర మరియు బాలికలు) ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడం కొరకు తాత్కాలిక పద్ధతిన బోధన సిబ్బంది ఎంపిక కొరకై అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం. ఈ పత్రికా ప్రకటనను కాలేశ్వరం జోన్ జోనల్ అధికారి శ్రీమతి హెచ్ అరుణ కుమారి గారు విడుదల చేశారు.
ఖాళీల వివరాలు:
- తెలుగు,
- హిందీ,
- ఇంగ్లీషు (లాంగ్వేజెస్),
- జూనియర్ లెక్చరర్,
- పిజిటి,
- పీజీటీ మరియు హెల్త్ సూపర్వైజర్ పోస్టుల కొరకు 29.05.2025 తేదీన.
కోర్ సబ్జెక్టులైన..
- మ్యాథమెటిక్స్,
- సైన్స్,
- సోషల్ మరియు లైబ్రరియన్ సబ్జెక్టులకు 30.05.2025 న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల (బాలురు) ములుగు జిల్లా నందు ఉదయం 9 గంటల నుండి డెమో ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపడతారు.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలను 50% మార్కులతో పాటు B. Ed అర్హత కలిగి ఉండాలి.
- ఉన్నతస్థాయి మరియు ఇంటర్మీడియట్ స్థాయి సబ్జెక్ట్ సిలబస్ ను బోధించడంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- PET/PD పోస్టుల కొరకు UGD-P.Ed/ B.P.Ed/ M.P.Ed అర్హతలు 50 శాతం మార్పులకు తగ్గకుండా ఉండాలి.
- హెల్త్ సూపర్వైజర్ పోస్టుల కొరకు General Nursing మరియు Midwifary(GNM లేదా B.Sc (Nursing) అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 55 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ అకాడమిక్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిట్ ఏజ్ మార్పులను కేటాయిస్తూ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను ప్రకటించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- జూనియర్ లెక్చలర్లకు రూ.23,400/-,
- PGT's & TGT's లకు రూ.15,200/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను నేరుగా ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమకు సమీపంగా ఉన్న ఏదైనా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో సమర్పించుకోవాలి.
దరఖాస్తులో భాగంగా ఈ దిగువ పేర్కొన్న సర్టిఫికెట్ల కాపీలను అప్లోడ్ చేయాలి. అవి;
- SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిజి మార్క్ మెమోలు,
- ప్రొవిజినల్ సర్టిఫికెట్లు,
- కుల ధ్రువీకరణ పత్రం,
- లోకల్ నేటివిటీ సర్టిఫికెట్
- 4 వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు.. మొదలగునవి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 27.05.2025 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment