LIC JOBs 2022 | ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలు ఇవే..
నిరుద్యోగులకు శుభవార్త!
ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏదైనా డిగ్రీ అర్హతతో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తో సహా దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ సెంటర్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు జరగనున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 8 నుండి ప్రారంభమై 25న ముగియనుంది. అలాగే రాతపరీక్షకు 7 నుండి 14 రోజుల ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు. సెప్టెంబర్లో ఆన్లైన్ రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో సూచించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు మొదలగు సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 80
విభాగాల వారీగా ఖాళీలు:
అసిస్టెంట్ ఈ విభాగంలో - 50,
అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో - 30.
వీటిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడిగా పోస్టులు కేటాయించారు వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ తో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
జనవరి 1 2022 నాటికి 21 నుండి 40 సంవత్సరాల కు మించకుండా వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
◆ అసిస్టెంట్లుగా ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే స్కేల్ ₹.22,730/- ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి ₹.33,960/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
◆ అసిస్టెంట్ మేనేజర్ గా ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే స్కేల్ ₹.53,620/-ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి ₹.80,110/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
IBPS PO/MT Vacancies of 6432 Recruitment 2022 | IBPS నుండి 6432 పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ ప్రకటన..
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ అసిస్టెంట్ పోస్టులకు ₹.800/-
◆ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ₹.800/-







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.08.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.lichousing.com/
వివరణాత్మక ప్రకటనను వీక్షించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment