IBPS PO/MT Vacancies of 6432 Recruitment 2022 | IBPS నుండి 6432 పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ ప్రకటన..
భారతీయ గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
IBPS - (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైని విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ క్రింద పేర్కొన్నటువంటి బ్యాంకులలో పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
బ్యాంకుల వివరాలు:
◆ బ్యాంక్ ఆఫ్ బరోడా
◆ కెనరా బ్యాంక్
◆ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
◆ యూ సి ఓ బ్యాంక్
◆ బ్యాంక్ ఆఫ్ ఇండియా
◆ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
◆ పంజాబ్ నేషనల్ బ్యాంక్
◆ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
◆ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
◆ ఇండియన్ బ్యాంక్
◆ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. మొదలగునవి.
CRP - PO/MT - XII ఆర్థిక సంవత్సరం 2023-24 కు గాను 1. ప్రొబేషనరీ ఆఫీసర్, 2. మేనేజ్మెంట్ ట్రైని విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ఆగస్టు 2 నుండి నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది.. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 22 వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చు.
ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు..
◆ భారతీయ అభ్యర్థులు అర్హులు,
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
◆ ఆగస్టు 1, 2022 నాటికి 20-30 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.
◆ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారం (వయో-పరిమితిలో సడలింపు లు) వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
◆ దరఖాస్తులను ఆన్లైన్లోనే స్వీకరిస్తారు.
◆ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో ఇబ్బంది ఉన్నవారు ఈ క్రింది వీడియో చూడండి.
◆ జనరల్ అభ్యర్థులకు ₹.850/-
◆ రిజర్వేషన్ వర్గాలవారికి ₹.175/- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
◆ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య జిల్లాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.







ముఖ్య సమాచారం:
అధికారిక వెబ్సైట్ :: https://www.ibps.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.08.2022.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment