BEL Recruitment 2022 | BEL Inviting Applications for 136 Vacancies | Check Details here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రాజెక్ట్ యూనిట్లలో ట్రైనీ ఇంజనీర్/ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
రాత పరీక్ష/ షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 09.11.2022 నుండి 25.11.2022 వరకు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! 245 మేనేజ్మెంట్ ట్రైనింగ్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.
ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- నుండి రూ.55,000/- ప్రతినెల జీతం గా చెల్లిస్తారు.
● అభ్యర్థుల క్రమశిక్షణను బట్టి ఒప్పంద కాలం పొడిగించే అవకాశం ఉన్నది.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ప్రాజెక్ట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఇంజనీర్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఏ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పోర్ట్ బ్లేర్, గుర్గాన్, కొచ్చి, గాంధీనగర్, కోల్కత్తా, వైజాగ్, చెన్నై, ముంబై, మరియు బెంగళూరు యూనిట్లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తాజాగా విడుదల చేసిన 3 నోటిఫికేషన్లకు దరఖాస్తులు చేయవచ్చు.. ప్రతి నోటిఫికేషన్ కు వేరు, వేరుగా దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం దిగువన..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 136.
తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ట్రైనీ ఇంజనీర్-1 - 62,
◆ ప్రాజెక్ట్ ఇంజనీర్-1 - 74.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల రెగ్యులర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
నవంబర్ 01, 2022 నాటికి 28 - 32 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి. అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు తప్పక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
ఎంపిక విధానం:
◆ రాత పరీక్ష/ షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఉంటుంది.
◆ రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు దరఖాస్తు సమయంలో సమర్పించిన మొబైల్ నెంబర్/ ఈమెయిల్ ఐడి లకు రాత పరీక్ష సమాచారం అందజేయబడుతుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించే రూ.30,000 - 55,000 వేల వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాలి.







ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ ప్రాజెక్ట్ ఇంజనీర్ లకు - రూ.450/-,
◆ ట్రైనీ ఇంజనీర్ లకు - రూ.150/-.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.11.2022 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.11.2022.
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
ప్రతి నోటిఫికేషన్ కు వేరు, వేరు చిరునామా అందుబాటులో ఉన్నది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తప్పక నోటిఫికేషన్ ల ఆధారంగా దరఖాస్తులు సమర్పించండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment