ECIL Technical Officer Recruitment 2022 | తెలంగాణ, హైదరాబాద్ లోని ECIL రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త!
B.E/ B.Tech తో తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) హైదరాబాద్, భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! రూ.25,000/- నుండి రూ.31,000/- జీతంతో ఉద్యోగ అవకాశాలను అందించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవడానికి ఈనెల 26, 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాత్మక సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ..
తప్పక చదవండి :: సంగారెడ్డి లోని భారత్ డైనమిక్ లిమిటెడ్ 119 గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్ ల భర్తీకి ప్రకటన..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 191.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత బ్యాచిలర్ ఇంజనీరింగ్ విభాగంలో B.E/ B.Tech అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
◆ 31.10.2022 నాటికి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపులు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: తెలంగాణ జిల్లా ప్రభుత్వ కాలేజీలో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు పూర్తి విధానం ఇక్కడ..
ఎంపిక విధానం:
◆ ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు!.
◆ అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా వెయిటేజ్ మార్పులను కేటాయిస్తూ ఎంపికలు చేస్తారు.
◆ విద్యార్హతలకు 20% మార్కులు.
◆ అనుభవానికి 30% మార్కులు.
◆ పర్సనల్ ఇంటర్వ్యూకు 50% మార్కులు కేటాయించారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు..
మొదటి సంవత్సరం రూ.25,000/-,
2వ సంవత్సరం రూ.28,000/-,
3వ & 4వ సంవత్సరం రూ.31,000/-.. ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
గమనిక :: ఈ ఉద్యోగాలను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.. అవసరాన్ని బట్టి అభ్యర్థుల క్రమశిక్షణ ఆధారంగా కాంట్రాక్ట్ పీరియడ్ పొడిగించే అవకాశం ఉంది.
తప్పక చదవండి :: 10వ తరగతి, డిగ్రీ పాస్ తో.. కేంద్ర ప్రభుత్వ శాశ్వత కొలువులు.. పూర్తి వివరాలు ఇక్కడ..
దరఖాస్తు విధానం:
ఎలాంటి ఆన్లైన్ ఆఫ్ లైన్ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదు!. నేరుగా ఇంటర్వ్యూ లే..
దరఖాస్తు ఫీజు : లేదు.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 26, 28 & 29 నవంబర్ 2022, తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు..
◆ రిపోర్టింగ్ సమయం: ఉదయం 09:00 గంటల నుండి,
◆ ఇంటర్వ్యూ ప్రారంభ: ఉదయం 11:30 నుండి..
ఇంటర్వ్యూ వేదిక: ECIL హైదరాబాద్, తెలంగాణ.
తప్పక చదవండి :: తెలంగాణ జిల్లా ప్రభుత్వ కాలేజీలో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు పూర్తి విధానం ఇక్కడ..
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.







◆ అధికారిక వెబ్సైట్ లింక్: https://www.ecil.co.in/
◆ అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి అధికారిక Home పేజీలోని Career లింక్ పై క్లిక్ చేసి, Current Job Openings లింక్ పై క్లిక్ చేయండి
◆ అధికారిక నోటిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది, సంబంధిత లింక్స్ పై క్లిక్ చేసి వివరాలను తెలుసుకొని, ఇంటర్వ్యూలకు హాజరుకండి.
◆ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను దరఖాస్తు ఫామ్ తో జత చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆదికారిక ఇంటర్వ్యూ షెడ్యూల్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
I have no experience (0 experience),shall I attend an interview for ECIL.
ReplyDeleteYes, You should Attend.. Thankyou.
ReplyDelete