BDL Recruitment 2022 | తెలంగాణ, సంగారెడ్డి లోని BDL 119 ఖాళీల భర్తీకి ప్రకటన.. పూర్తి దరఖాస్తు విధానం ఇక్కడ.
సంగారెడ్డి లోని భారత్ డైనమిక్ లిమిటెడ్ 119 గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్ ల భర్తీకి ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ, సంగారెడ్డి లోని BDL 119 ఖాళీల భర్తీకి ప్రకటన.. పూర్తి దరఖాస్తు విధానం ఇక్కడ.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15.11.2022 నుండి, 25.11.2022 వరకు నేషనల్ అప్రెంటిస్ట్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని.. 30.11.2022 వరకు భారత్ డైనమిక్ లిమిటెడ్, బానూర్ నందు సమర్పించాలి.
భారత్ డైనమిక్ లిమిటెడ్ అప్రెంటిషిప్ నియామకాలు - 2022:
భారత ప్రభుత్వనికి చెందిన, భారత్ డైనమిక్ లిమిటెడ్ అప్రెంటిస్ట్ నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది, నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత విభాగంలో అర్హత కలిగిన అభ్యర్థులు గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్ పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు ముందుగా, నోటిఫికేషన్ లో ఇచ్చిన కోడ్ (STLMEC000002) ఆధారంగా, అధికారిక పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
తప్పక చదవండి :: ఎలాంటి అనుభవం లేకుండా 661 శాశ్వత జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి మహా జెన్కో భారీ ప్రకటన.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 119.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
★ గ్రాడ్యుయేట్ విభాగంలో..
◆ మెకానికల్ ఇంజనీరింగ్ - 35,
◆ సిఎస్ఈ/ ఐటి - 10,
◆ ఈసిఈ - 25,
◆ ఈఈఈ - 08,
◆ సివిల్ ఇంజనీరింగ్ - 02,
◆ ఈఐఈ - 01,
◆ కెమికల్ ఇంజనీర్ - 02.. ఇలా మొత్తం 83.
తప్పక చదవండి :: DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
★ టెక్నీషియన్ విభాగంలో..
◆ మెకానికల్ ఇంజనీరింగ్ - 14,
◆ సిఎస్ఈ/ ఐటి - 04,
◆ ఈసిఈ - 04,
◆ ఈఈఈ - 08,
◆ సివిల్ ఇంజనీరింగ్ - 06.. ఇలా మొత్తం 36 ఖాళీలను భర్తీకి ప్రకటించింది.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లమో అర్హతలను కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హతతో 345 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
◆ ఈ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
◆ వచ్చిన దరఖాస్తులను అకాడమిక్/ టెక్నికల్ విద్యారహతల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, అర్హత దృపత్రాల కాపీలను పరిశీలించి తదుపరి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
తప్పక చదవండి :: B.E/ B.Tech/ B.Sc(Engg)/Diploma అర్హతతో 800 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు పూర్తి విధానం ఇక్కడ.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.8,000/- నుండి రూ.9,000/- వేల వరకు ప్రతి నెల శిక్షణ కాలం ముగిసేంతవరకు జీతం గా చెల్లిస్తారు.
శిక్షణ కాలం : ఒక(1) సంవత్సరం.
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి, డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.11.2022 వరకు.
భారత్ డైనమిక్ లిమిటెడ్, బానూర్ నందు దరఖాస్తుల సమర్పించడానికి చివరి తేదీ :: 30.11.2022.







అధికారిక నేషనల్ అప్రెంటిస్ట్ పోర్టల్ నందు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ :: http://portal.mhrdnats.gov.in/
◆ ఇప్పటికే రిజిస్ట్రేషన్ కలిగిన అభ్యర్థులు Login పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ నమోదు చేసే లాగిన్ అయి దరఖాస్తులను సమర్పించవచ్చు.
◆ కొత్తగా నమోదు చేసుకుంటున్నా అభ్యర్థులు, Enroll బటన్ పై క్లిక్ చేసి, సంబంధిత వ్యక్తిగత, విద్యార్హత, వివరాలను నమోదు చేస్తూ, రిజిస్ట్రేషన్ చేసుకుని.. తదుపరి లాగినై, ఇవ్వబడిన ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ఆధారంగా దరఖాస్తులు సమర్పించవచ్చు..
◆ విజయవంతంగా సమర్పించిన దరఖాస్తును భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
ఇప్పుడే నేరుగా దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment