TSPSC Group-4 Notification for 9,168 Vacancies | TS 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ | Download Scheme of Examination and Syllabus here..
![]() |
TS 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నియామకాలను చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే, తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-4 సర్వీస్ లోని 9,168 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 01, 2022న WEBNOTE జారీచేసింది.. 23.12.2022 నుండి 12.01.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు సమాచారం..
ఈ ఖాళీలు జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అడిటర్ & వార్డ్ ఆఫీసర్ మరియు ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నాయి.
గ్రూప్-4, సర్వీసెస్-2022, డిపార్ట్మెంట్ల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి & అధికారిక నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ గ్రూప్-4 సర్వీసెస్ కు సంబంధించిన రాత పరీక్షలు ఏప్రిల్/ మే - 2023 లో జరుగనున్నట్లు ముందస్తు సమాచారం.
గ్రూప్-4 సర్వీసెస్ - పోస్టులకు నియామకాల కోసం స్కీం మరియు సిలబస్, పరీక్ష పథకం:
• రాతపరీక్ష మల్టిపుల్ ఛాయిస్ కోషన్స్ రూపంలో మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు.
• ఇందులో పేపర్-1, పేపర్-2 లు ఉంటాయి.
• పేపర్-1, లో జనరల్ స్టడీస్ నుండి 150 ప్రశ్నలు,
• పేపర్-2, లో సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుండి 150 ప్రశ్నలు.. అడుగుతారు.
• ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
• పరీక్షా సమయం (150+150) 300 నిమిషాలు.
NEW! డిగ్రీ తో హైదరాబాద్ CRIS లో శాశ్వత ఉద్యోగాలు | Check eligibility and Application Process here..
గ్రూప్-4 సర్వీసెస్ - 2022 సిలబస్:
• పేపర్-1 జనరల్ స్టడీస్:
1. కరెంట్ అఫైర్స్,
2. అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు,
3. రోజువారీ జీవితంలో జనరల్ సైన్స్,
4. పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ,
5. భారతదేశం మరియు తెలంగాణ భౌగోళిక శాస్త్రం మరియు ఆర్థిక వ్యవస్థ,
6. భారత రాజ్యాంగం, ముఖ్యమైన లక్షణాలు,
7. భారత రాజకీయ వ్యవస్థ మరియు ప్రభుత్వం,
8. భారత జాతీయ ఉద్యమం పై దృష్టిసారించిన ఆధునిక భారతీయ చరిత్ర,
9. తెలంగాణ మరియు తెలంగాణ ఉద్యమ చరిత్ర,
10. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం,
11. తెలంగాణ రాష్ట్ర విధానాలు.. మొదలగు అంశాల నుండి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు.
NEW! 7,540 శాశ్వత ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
• పేపర్-2 (పాలనా సామర్థ్యాలు) సెక్రటేరియల్ ఎబిలిటీస్:
1. మానసిక సామర్థ్యం(మెంటల్ ఎబిలిటీ). (మౌఖిక మరియు అశాబ్దిక),
2. లాజికల్ రీజనింగ్,
3. గ్రహణశక్తి (కాంప్రెహెన్షన్),
4. ఒక ప్రకరణము యొక్క విశ్లేషణను మెరుగుపరిచే ఉద్దేశంతో వాక్యాల పునర్వ్యవస్థీకరణ,
5. సంఖ్య మరియు అంకగణిత సామర్ధ్యాలు.. మొదలగు అంశాల నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.







వివరణాత్మక సిలబస్ PDF డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
అధికారిక గ్రూప్-4 నోటిఫికేషన్-2022 :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment