6వ, Intere 1st సైనిక పాఠశాల ప్రవేశాలు 2024: Sainik School Admission for VI & XI CBSE AY 2024-25 Check eligibility and Apply Online here..
6వ తరగతి మరియు Inter 1st (MPC) సైనిక పాఠశాల ప్రవేశాలు 2024:
తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని అశోక్ నగర్ గిరిజన సంక్షేమ గురుకుల సైనిక్ పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేసుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త !
తెలంగాణ అశోక్ నగర్ సైనిక్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతి & 11వ తరగతి లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులను 26-02-2024 నుండి 18-03-2024 వరకు సమర్పించవచ్చు. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక పరీక్ష 07-04-2024 (ఆదివారం) నాడు నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల విద్యార్థినీ విద్యార్థులు ఈ ప్రవేశాల కోసం పోటీ పడవచ్చు. శారీరక సామర్ధ్య పరీక్ష మరియు ప్రవేశ అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించబడతాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అర్హత ప్రమాణాలు :
- 2024-25 విద్యా సంవత్సరానికి అశోక్ నగర్ సైనిక పాఠశాలలో ప్రవేశం పొందడానికి ఈ క్రింది అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి...
- 6వ తరగతి లో ప్రవేశం కోసం 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
- 11వ తరగతి (Inter 1st) లో ప్రవేశం కోసం మార్చి/ ఏప్రిల్-2024లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చు.
విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయ వివరాలు:
- ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పరిమితి,
- గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000/- మించకుండా..
- పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.2,00,000/- మించకుండా ఉండాలి
వయోపరిమితి:
- 6వ తరగతిలో చేరే విద్యార్థి వయస్సు 01-04-2024 నాటికి 11 సంవత్సరాలు మించకూడదు.
- ఇంటర్ మొదటి సంవత్సరం లో చేరే విద్యార్థి వయస్సు 01-04-2024 నాటికి 16 సంవత్సరాలు మించకూడదు.
సీట్ల వివరాలు:
- 6వ తరగతిలో 80 సీట్లు ఉన్నవి.
- ఇంటర్(ఎంపీసీ) లో 80 సీట్లు కలవు.
వర్గాల వారీగా సీట్ల వివరాలు:
- ST విద్యార్థులకు - 58 సీట్లు కలవు.
- BC విద్యార్థులకు - 05 సీట్లు కలవు.
- SC విద్యార్థులకు - 05 సీట్లు కలవు.
- మైనారిటీ విద్యార్థులకు - 05 సీట్లు కలవు.
- ఇతరులకు (మిగిలిన వర్గాల) విద్యార్థులకు - 05 సీటు కలవు.
- గురుకులం ఎంప్లాయి కోట లో - 01 సీటు కలదు,
- మరియు స్పోర్ట్స్ కోట లో - 01 సీటు కలదు.
- ఈ విధంగా అన్ని వర్గాల వారికి ప్రవేశము కలదు.
ఎంపిక విధానం :
- మూడు దశలుగా ఎంపికలను నిర్వహిస్తారు.
- మొదటి దశ: ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష ఆధారంగా
- రెండో దశ: ఫిజికల్ టెస్ట్, సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ ఆధారంగా..
- మూడో దశ: మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాలను నుండి ప్రశ్నలు అడుగుతారు.
- 6వ తరగతి ప్రవేశం కొరకు.. ఈ క్రింది అంశాల నుండి రాత పరీక్షలో ప్రశ్నలు అడుగుతారు. అవి;
- తెలుగు నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- ఇంగ్లీష్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు,
- గణితం నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు,
- సైన్స్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
- సోషల్ స్టడీస్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు అడుగుతారు.
- ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు ప్రవేశ పరీక్ష ప్రశ్నా పత్రం ఉంటుంది..
- ప్రశ్నాపత్రం 5వ తరగతి సిలబస్ అనుగుణంగా ఉంటుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి పావు (0.25) మార్క్ కోత విధిస్తారు.
- ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం MPC గ్రూప్ లో ప్రవేశాల కోసం ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- ఇంగ్లీష్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- గణితం నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,
- భౌతిక శాస్త్రం నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- రసాయనిక శాస్త్రం నుండి 15 ప్రశ్నలు 15 మార్కులకు,
- బయాలజీ నుండి 5 ప్రశ్నలు 5 మార్కులకు.. అడుగుతారు.
- ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం ఉంటుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి పావు (0.25) మార్క్ కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 26-02-2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 18-03-2024 వరకు.
హాల్టికెట్ డౌన్లోడ్ తేదీ : 01-04-2024 నుండి,
ప్రవేశ పరీక్ష తేదీ : 07-04-2024.
పరీక్ష ఫలితాలు విడుదల తేదీ : 24-04-2024.
6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ (MPC) మొదటి సంవత్సరం అశోక్ నగర్ సైనిక పాఠశాల లో ప్రవేశం పొందే అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు 01-05-2024 నుండి 06-05-2024 వరకు నిర్వహిస్తారు.
ప్రవేశ తేది : 12.06.2024.
పరీక్ష సెంటర్లు : సంబంధిత జిల్లాలోని ముఖ్య పాఠశాలలో నిర్వహిస్తారు.
అధికారిక వెబ్సైట్ : https://www.tgtwgurukulam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే (6వ & Inter 1st) కొసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment