APPSC Gazetted Officer Recruitment 2021 || Graduate may Apply Online || Check eligibility criteria and Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
గ్రాడ్యుయేట్ విద్యార్హతతో, శాశ్వత ప్రాతిపదికన రూ.93,780/- గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు విధానం, పరీక్ష సిలబస్, దరఖాస్తు ఫీజు, చివరి తేదీ మొదలగు పూర్తి సమాచారం ఇక్కడ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది.
ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వివిధ నోటిఫికేషన్ల ద్వారా నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా 25 గెజిటెడ్ పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది.
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 25,
విభాగాల వారీగా ఖాళీలు, విద్యార్హత, వయస్సు, జీతం, మొదలగు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ -11,
2. సెరికల్చర్ ఆఫీసర్ - 01,
3. అగ్రికల్చర్ ఆఫీసర్ - 06,
4. డివిజినల్ అకౌంట్ ఆఫీసర్ - 02,
5. టెక్నికల్ అసిస్టెంట్ - 01,
6. అసిస్టెంట్ కమిషనర్ - 03,
7. అసిస్టెంట్ డైరెక్టర్ - 01,..
విద్యార్హత: పోస్టులను అనుసరించే బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్, న్యాయశాస్త్రంలో డిగ్రీ, ఎమ్మెస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, సెరికల్చర్, బోటనీ జువాలజీ లో మాస్టర్ డిగ్రీ, అగ్రికల్చర్ బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ మొదలగునవి విద్యార్హతలు గా కలిగి ఉండాలి.
వయసు : జూలై 1 2021 నాటికి 18 సంవత్సరాలకు తగ్గకుండా 42 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు లకు అవకాశాన్ని కల్పించారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
జీతం: వివిద పోస్టులను అనుసరించి రూ.29,760/- నుండి రూ.93,780/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు..
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో పరీక్ష ఉంటుంది.
ఇందులో మొత్తం 3 పేపర్లు ఉంటాయి..
పేపర్ -1: జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
పేపర్ -2: సెరికల్చర్ నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
పేపర్ -3: అగ్రికల్చర్ మరియు బయో సైన్స్ నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
పరీక్ష సమయం 450 నిమిషాలు.
దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.250/-.
ఎస్సీ /ఎస్టీ /బిసి /పి.హెచ్.సి, మరియు మాజీ సైనికులకు ఫీజు మినహాయించారు.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు, దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://psc.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.12.2021 నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.12.2021.
Comments
Post a Comment