Union Bank Recruitment 2021 || Graduates can apply online || Register online here..
యూనియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకుఉద్యోగ నియామకాలకు ప్రకటన.
నిరుద్యోగులకు శుభవార్త! యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2021-22. ఎటువంటి రాతపరీక్ష లేకుండా, అకడమిక్ విద్యార్హతలకు సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ నియామకాలను చేపడుతున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ 31.12.2021.
ముంబై కేంద్రంగా పనిచేస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్/ డొమైన్ ఎక్స్పర్ట్ ఈ విభాగంలో పలు ఖాళీలను ఈ నియామక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 06,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. చీప్ రిస్క్ ఆఫీసర్ - 01,
2. చీఫ్ డిజిటల్ ఆఫీసర్ - 01,
3. హెడ్ అనలిటిక్స్ - 01,
4. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ - 01,
5. హెడ్ ఏపీఐ మేనేజ్మెంట్ - 01,
6. హెడ్ డిజిటల్ లీడింగ్ అండ్ ఫైన్ టెక్ - 01,..
విద్యార్హత: వేరు వేరు పోస్టులకు వివిధ విద్యార్హతలు, అనుభవం కలిగి ఉండాలి. బీఈ/ బీటెక్/ గ్రాడ్యుయేషన్/ మాస్టర్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఈ ఖాళీలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయవచ్చు.. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ ను చదవండి. నోటిఫికేషన్ పిడిఎఫ్ డైరెక్ట్ లింక్ క్రింద అందుబాటులో ఉన్నది.
వయసు: పై పోస్టులను అనుసరించి 35 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయండి.
3. అనంతరం కరెంట్ రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయండి.
4. అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో క్లిక్ హియర్ తో అప్లై ఆన్లైన్ లింక్ పై క్లిక్ చేయండి.
5. ముందుగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
6. అనంతరం, ఆన్లైన్ దరఖాస్తులను సంబంధిత వివరాలతో విజయవంతంగా సమర్పించండి.
అధికారిక వెబ్సైట్: https://www.unionbankofindia.co.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ ఇదే :: 👈
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment