ICAR naarm Walk in Interview Recruitment 2021 || Inter Degree PG PhD may apply Online || Download application here..
హైదరాబాద్ లోని ఐకార్-నార్మ్ 21 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాదులోని ఐకార్- నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఇరవై ఒక్క పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. రాజేంద్రనగర్, హైదరాబాద్-తెలంగాణ లో ఈ ఉద్యోగాలు..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 21,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. యంగ్ ప్రొఫెషనల్ -II - 18,
2. ఆఫీస్ అసిస్టెంట్ - 02,
3. రీసెర్చ్ అసోసియేట్ - 01,
4. సీనియర్ రిసెర్చ్ ఫెలో - 01,.
విద్యార్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీటెక్, మాస్టర్ డిగ్రీ మొదలగునవి లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు: ఇంటర్వ్యూ నిర్వహించే తేదీనాటికి, 21 సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు బయో పరిమితిలో సడలింపు కల్పిస్తారు.
జీతం:
■ యంగ్ ప్రొఫెషనల్ లకు ప్రతి నెల రూ.30,000/-జీతంగా చెల్లిస్తారు.
■ ఆఫీస్ అసిస్టెంట్ లకు రూ.10,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు
■ రీసెర్చ్ అసోసియేట్ లకు రూ.49,000/- నుండి రూ.54,000/-వేల వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
■ సీనియర్ రీసెర్చ్ ఫెలో లకు రూ.31,000/- నుండి రూ.35,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఇంటర్వ్యూ తేదీ రోజు స్వయంగా సమర్పించాలి.
ఈ ఇంటర్వ్యూ లకు ఎటువంటి కాల్ లెటర్, ఫోన్ కాల్ చేయరు.
ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ:
రీసెర్చ్ అసోసియేట్ -1, సీనియర్ రిసెర్చ్ ఫెలో-1, ఆఫీస్ అసిస్టెంట్-1, పోస్టులకు డిసెంబర్ 16, 2021 ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి, రిజిస్ట్రేషన్ ప్రారంభించి.. ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
యంగ్ ప్రొఫెషనల్ -II -18, ఆఫీస్ అసిస్టెంట్ -1, పోస్టులకు డిసెంబర్ 21, 2021 ఉదయం 9 గంటల నుండి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. 10 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులను రిజిస్ట్రేషన్ చేయరు.
ఇంటర్వ్యూల కి హాజరయ్యే అభ్యర్థులు కరుణ నిబంధనలు పాటించాలి.
అధికారిక వెబ్సైట్: https://naarm.org.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి1 & చదవండి/ డౌన్లోడ్ చేయండి2.
Comments
Post a Comment