Sainik school teaching faculty recruitment 2021 || No exam required || walk in interviews || check eligibility criteria and more information here..
సైనిక పాఠశాల లో బోధన సిబ్బంది నియామకానికి ప్రకటన:
సైనిక్ పాఠశాల కలికిరి, చిత్తూరు జిల్లా, తాత్కాలిక ప్రాతిపదికన పిజిటి(ఇంగ్లీష్) బోధించడానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా, పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచ గల అభ్యర్థులు డిసెంబర్ 15, 2021 న ఇంటర్వ్యూలకు హాజరు అవ్వాలని కోరారు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 01,
విభాగం: పిజిటి(ఇంగ్లీష్).
అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనుబంధ సంస్థ నుండి సంబంధిత సబ్జెక్టులో బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అనుభవం: సీబీఎస్సీ పాఠశాలల్లో రెండు నుండి నాలుగు సంవత్సరాలు పని చేసిన అనుభవం కోరుతున్నారు.
జీతం: రూ.60,928/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
వయసు: డిసెంబర్ 1, 2021 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://sskal.ac.in/home
Comments
Post a Comment