Bank of Baroda Recruitment 2021 || Graduate can apply 376 Vacancies of Various posts ||Check eligibility and Apply online here..
బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది..
బ్యాంక్ ఆఫ్ బరోడా వరుసగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా మరొక నోటిఫికేషన్ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ లో భారతదేశంలో విస్తరించి ఉన్న వివిధ రాష్ట్రాల లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖల్లో 376 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది..
ఈ నోటిఫికేషన్ లో హైదరాబాదులో కూడా ఖాళీలు ఉన్నాయి..
గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగి ఉన్న అభ్యర్థులు, అలాగే గ్రాడ్యుయేట్ విద్యార్హతతో పాటు బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు లను ఆన్లైన్లో సమర్పించవచ్చు..
ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 9, 2021.
నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 376,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి సడలింపు ల వివరాలను ఇక్కడ చదవండి..
సీనియర్ రిలేషన్ మేనేజర్ - 326,
ఈ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ - 59..
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.. అలాగే మేనేజ్మెంట్లో రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా పాసైన అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.. మరియు NISM, IRDA.. రెగ్యులేటరీ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని నోటిఫికేషన్లు పేర్కొన్నారు.
అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, ప్రైవేట్ బ్యాంకుల్లో సంబంధిత పనిలో కనీసం రెండు సంవత్సరాల పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 24 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఈ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.. అలాగే మేనేజ్మెంట్లో రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా పాసైన అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.. మరియు NISM, IRDA.. రెగ్యులేటరీ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని నోటిఫికేషన్లు పేర్కొన్నారు.
అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, ప్రైవేట్ బ్యాంకుల్లో సంబంధిత పనిలో కనీసం రెండు సంవత్సరాల పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 23 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను చదవండి.
అధికారిక నోటిఫికేషన్: ఇక్కడ చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ లను నిర్వహించి తుది ఎంపికలు ఖరారు చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600/-.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు రూ.100/-
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.bankofbaroda.in/
2. కరెంట్ ఆపర్చునిటీస్ లింక్ పై క్లిక్ చేయండి.
3. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ఈ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ నోటిఫికేషన్స్ వేరువేరుగా ఉంటాయి.
4. సంబంధిత నోటిఫికేషన్ పక్కన కనిపిస్తున్న ఆన్లైన్ అప్లై లింక్ పై క్లిక్ చేయండి.
5. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, ఇక్కడ మొదట పోస్టు సెలక్ట్ చేయండి, తర్వాత మీ పేరు మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడిలను ఎంటర్ చేసి, క్యాన్సర్ ఎంటర్ చేసే గెట్ ఓటిపి పై క్లిక్ చేయండి.
6. రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. సంబంధిత ఓటిపి ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
7. తదుపరి మీ ఫోటో, సిగ్నేచర్ లను అప్లోడ్ చేయండి.
8. దరఖాస్తు ఫీజును ఆన్లైన్లో చెల్లించి. ఆన్లైన్ దరఖాస్తును విజయవంతంగా సమర్పించండి.
అధికారిక నోటిఫికేషన్: ఇక్కడ చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయడానికి: ఇక్కడ క్లిక్ చేయండి.
ఈవెంట్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయడానికి: ఇక్కడ క్లిక్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment