BECIL Recruitment 2021 || 5th, 10th, Graduates may apply Online || No Written Exam Required || check eligibility and more details here..
బిఈసిఐఎల్-బ్రాడ్ క్యాప్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.
బిఈసిఐఎల్-నుండి 5వ తరగతి, 10వ తరగతి, గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్నటువంటి మొత్తం 55 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు సూచించారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించబడింది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 10, 2021. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడానికి ముందు నోటిఫికేషన్ను చదవండి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 55,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హతలు, జీతాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ -32,
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాస్.
జీతం: రూ.17,537/- ప్రతి నెలా చెల్లిస్తారు.
2. హౌస్ కీపింగ్ స్టాఫ్ - 20,
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 5వ తరగతి పాస్.
జీతం: రూ.15,908/- ప్రతి నెలా చెల్లిస్తారు.
3. మాలి - 1,
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 5వ తరగతి పాస్.
జీతం: రూ.15,908/- ప్రతి నెలా చెల్లిస్తారు.
4. సూపర్వైజర్ - 1,
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత తో సంబంధిత పనిలో రెండు సంవత్సరాల అనుభవం కోరుతున్నారు.
జీతం: రూ.29,976/- ప్రతి నెలా చెల్లిస్తారు.
5. గార్బేజ్ కలెక్టర్ - 1,
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 5వ తరగతి పాస్.
జీతం: రూ.15,908/- ప్రతి నెలా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం : అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.750/-.
రిజర్వేషన్ అభ్యర్థులకు రూ.450/-
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్ చేసే అభ్యర్థులను ఎంపిక చేస్తారు, ఎంపికైన అభ్యర్థుల వివరాలను రిజిస్టర్ ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియపరుస్తారు. అభ్యర్థులు రెగ్యులర్గా తమ ఇ-మెయిల్స్ తనిఖీ చేస్తూ ఉండండి.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://www.becil.com/
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.12.2021.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment