National Housing Bank Recruitment 2021 || Freshers can apply online || Check eligibility and more details here..
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎటువంటి అనుభవం లేని గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన స్పెషల్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు.. రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ అవకాశం లేదు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు, పోస్టుల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం ఈ క్రింది విధంగా ఉంది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ను పూర్తిగా చదివి తదుపరి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించండి. ఆన్లైన్ దరఖాస్తులు సమర్థించడానికి చివరి తేదీ డిసెంబర్ 30, 2021.
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్(స్కేల్ 1), డిప్యూటీ మేనేజర్(స్కేల్ 2), రీజనల్ మేనేజర్ (సేల్ 4)- రిస్క్ మేనేజర్.. ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 17,
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా ఈ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎటువంటి అనుభవం లేని స్పెషల్ అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి నియామకం లో వెయిటేజి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
వయసు: డిసెంబర్ 1, 2021 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
డిప్యూటీ మేనేజర్ పోస్టులకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ విద్యార్హతను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఎంబీఏ ఫైనాన్షియల్ కోర్సు ఉత్తీర్ణత కలిగి ఉన్నవారూ కూడా దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు.
వయసు: డిసెంబర్ 1, 2021 నాటికి 23 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
రీజనల్ మేనేజర్ (రిస్క్ మేనేజర్) ఉద్యోగాలకు విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ టౌన్ మేనేజ్మెంట్ మరియు గ్లోబల్ అసోసియేషన్ విద్యార్హతలు కలిగి ఉన్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తులు చేయవచ్చు. సంబంధిత పనిలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు: డిసెంబర్ 1, 2021 నాటికి 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
వయోపరిమితి సడలింపులు:
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను ఇక్కడ క్లిక్ చేసి చదవండి.
★ భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.
★ రాత పరీక్ష పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.
■ రీజనింగ్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ నుండి 45 ప్రశ్నలు అడుగుతారు.
■ జనరల్ అవేర్నెస్ లో ఎకానమీ, మరియు బ్యాంకింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 50 ప్రశ్నలు అడుగుతారు.
■ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు అడుగుతారు.
■ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ డాటా అనాలసిస్ మరియు ఇంటరాక్షన్ నుండి 35 ప్రశ్నలు అడుగుతారు.
■ పరీక్ష సమయం 3 గంటలు.
ఇలా మొత్తం 155 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు.
★ ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ఉంటుంది.
డిస్క్రిప్టివ్ విధానంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు లెటర్ రైటింగ్ ఎస్సై ల నుండి రెండు ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 30 నిమిషాలు..
జీతాల వివరాలు:
అసిస్టెంట్ మేనేజర్ లకు ప్రతి నెల రూ.60,056.72/-జీతంగా చెల్లిస్తారు.
డిప్యూటీ మేనేజర్ లకు ప్రతి నెల రూ.79,621.49/- జీతం గా చెల్లిస్తారు.
రీజనల్ మేనేజర్ లకు ప్రతి నెల రూ.1,26,954.37/-జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.850/-.
ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.175/-.
పరీక్ష సెంటర్ల వివరాలు:
దేశవ్యాప్తంగా మొత్తం 20 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్, విశాఖపట్టణం లో పరీక్ష సెంటర్లు కేటాయించారు.
దరఖాస్తులకు చివరి తేదీ : 30.12.2021.
అధికారిక వెబ్సైట్: https://nhb.org.in/en/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://ibpsonline.ibps.in/nhbrosmoct21/
Comments
Post a Comment