Development Assistant Recruitment 2022 | డిగ్రీతో 173 డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.
నిరుద్యోగులకు శుభవార్త!.
8వ తరగతి తో.. ITI సర్టిఫికెట్ కలిగి ఉన్నారా! భారతీయ పోస్టాఫీసుల్లో భారీగా ఉద్యోగాలు.
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు భారీ శుభవార్త చెప్పింది! రాత పరీక్షల ద్వారా భర్తీ చేయనున్న డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 15, 2022 నుండి 10 అక్టోబర్, 2022 వరకు సమర్పించవచ్చు. నవంబర్ 6వ తేదీన ఫేస్-1 ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించనుంది. ఫేస్-2 పరీక్షలకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోనూ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష వివరాలు, జీతభత్యాల.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :173,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 21 రీజనల్ ఆఫీస్ లలో ఈ కాళీ లు అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ వారికి - 7,
ఆంధ్రప్రదేశ్ వారికి -6.. ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
10వ తరగతి మరియు ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
విద్యార్హత:
◆ డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు..
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
◆ డెవలప్మెంట్ అసిస్టెంట్(హిందీ) ఉద్యోగాలకు..
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో హిందీ లేదా ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
◆ అభ్యర్థులు తప్పనిసరిగా ఇంగ్లీష్ నుండి హిందీ కు ట్రాన్స్లేట్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
సెప్టెంబర్ 1 2022 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారి నోటిఫికేషన్ను చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో భర్తీ! డి ఆర్ డి ఓ నుండి మరొక నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు. సంప్రదింపు వివరాల కోసం రూ.50/-చెల్లించాలి.
ఇతరులకు దరఖాస్తు ఛార్జ్ రూ.400/-, మరియు సంప్రదింపు ఛార్జ్ రూ.50/-చెల్లించాలి.
ఎంపిక విధానం:
◆ రాత పరీక్ష, ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
◆ రాత పరీక్షలు ప్రిలిమినరీ మెయిల్స్ రూపంలో నిర్వహిస్తారు.
◆ ఈ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమాలలో ఉంటాయి.
◆ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
◆ ప్రతి తప్పు సమాధానానికి0.25 మార్కు కోత విధిస్తారు.
★ ప్రాథమిక, మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.14,650 నుండి 34,990/-వరకు మరియు అన్ని అలవెన్సులు తో కలిపి దాదాపుగా రూ.32,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.10.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.nabard.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment