NTPC Assistant Jobs: ఎన్టిపిసి అసిస్టెంట్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ కెమిస్ట్ లో 230 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఎన్టీపీసీలో 230 అసిస్టెంట్ ఉద్యోగాలు
భారత దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ NTPC, ప్రస్తుతం 60,4880 మెగావాట్లు విద్యుత్ ను ఉత్పత్తి సామర్ధ్యం గా కలిగి ఉన్నది, దీని 2032 నాటికి ఇంకా 130 మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలనే ప్రధాన లక్ష్యం.
న్యూఢిల్లీలోని NTPC కేంద్ర కార్యాలయం తాజాగా వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
తప్పక చదవండి: Singeereni Jobs : సింగరేణి ఉద్యోగాలకు విడుదలైన నోటిఫికేషన్ సవరిస్తూ సవరణ నోటిఫికేషన్ విడుదల..
నోటిఫికేషన్ పూర్తి వివరాలు:
అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో మొత్తం ఖాళీలు : 200
పోస్టుల విభాగాలు.
1. ఎలక్ట్రికల్,
2.మెకానికల్,
3. ఎలక్ట్రానిక్,
4. ఇన్స్ట్రుమెంటేషన్.
1. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏస్సీ, ఏస్టీ, డబ్ల్యూ బీడీ అభ్యర్థులకు పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది.
అనుభవం: ట్రైనింగ్ పీరియడ్ కాకుండా ఒక సంవత్సరం పాటు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు రిజర్వేషన్ కేటగిరిల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
జీతం: పే స్కేల్ రూ. 30,000/- నుంచి రూ. 1,20,000/- వరకు చెల్లిస్తారు.
2. అసిస్టెంట్ కెమిస్ట్ విభాగంలో మొత్తం ఖాళీలు: 30
అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులకు విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులు పాస్ మార్కులు కలిగి ఉంటే సరిపోతుంది.
అర్హత: ట్రైనింగ్ పీరియడ్ కాకుండా కనీసం ఒక సంవత్సరం పాటు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
పవర్ ప్లాంట్ లో పనిచేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయస్సు: గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు రిజర్వేషన్ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
జీతం: పే స్కేల్ రూ. 30,000/- నుంచి రూ. 1,20,000/- వరకు చెల్లిస్తారు.
ఎన్టిపిసి అసిస్టెంట్ పోస్టుల ఎంపిక విధానం:
ఎవరైతే రాత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ ను కనపరిచిన ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది.
ఈ పరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది.
అది 1. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ 2. ఆప్టిట్యూడ్ టెస్ట్
అభ్యర్థులు రెండు విభాగాల్లోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది, దరఖాస్తు చేసుకునేటప్పుడు అనుకూలంగా ఎగ్జామ్ సెంటర్ ను ఎంపిక చేసుకోవాలని అధికారిక వెబ్సైట్ లో పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ EWS/ OBC కేటగిరీల అభ్యర్థులకు ఫీజు రూ. 300/- , ఏస్సీ, ఏస్టి, PWBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. వారు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం: 24.02.2021
ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ:10.03.2021
నోటిఫికేషన్ : చదవండి.
దరఖాస్తు చేసుకోవడానికి సోపానాలు:
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్సైట్ లింక్ : ntpccareers.net open.ntpccareers.net
2. కరెంట్ ఓపెనింగ్స్ లో స్క్రోల్ అవుతున్న టువంటి నోటిఫికేషన్స్ నుండి సంబంధిత నోటిఫికేషన్ క్రింద కనిపిస్తున్న క్లిక్ హియర్ టు అప్లై లింక్ పై క్లిక్ చేయండి.
3. దరఖాస్తు కు డైరెక్ట్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
4. సైడ్ బార్ లోని కనిపిస్తున్న అప్లై పై క్లిక్ చేయండి. 5. విద్యార్హత కు సంబంధించిన పోస్ట్ ను ఎంపిక చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయండి.
6. తరువాత అప్లై లింక్ పై క్లిక్ చేయండి.
7. ఆన్లైన్ అప్లికేషన్ షో అవుతుంది.. మీ వివరాలు ఎంటర్ చేసి చెక్ ఎలిజబులిటీ పై క్లిక్ చేయండి.
8. అర్హత ప్రమాణాల ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తును సమర్పించండి.
ఇది కూడా చదవండి : TSPSC RIMC Admission Notification-2021. ఆర్‌ఐఎంసీ లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు..
Comments
Post a Comment