Sainik School Recruitment 2021 | Various posts on Teaching and Non-Teaching staff | Check details here..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!. | కలికిరి సైనిక పాఠశాలలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. | అర్హత ప్రమాణాలు, జీతాల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్-చిత్తూరు జిల్లాలోని కలికిరి సైనిక పాఠశాల ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 18,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. టిజిటి సోషల్ సైన్స్ - 01,
2. టిజిటి మ్యాథమెటిక్స్ - 01,
3. లోయర్ డివిజన్ క్లర్క్ - 02,
4. జనరల్ ఎంప్లాయి ఎంటిఎస్ రెగ్యులర్ - 06,
5. జనరల్ ఎంప్లాయ్ ఎంటిఎస్ కాంట్రాక్ట - 08.
విద్యార్హత:
★ టిజిటి సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్ పోస్టులకు విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, అలాగే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 50 శాతం మార్కులతో బీఈడీ పూర్తి చేసి ఉండాలి, మరియు సీటెట్/ టెట్ అర్హత కలిగి ఉండాలి.
★ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు విద్యార్హత: పదవ తరగతి ఉత్తీర్ణతతో, నిమిషానికి 40 పదాలను ఇంగ్లీష్ మరియు హిందీ లో టైప్ చేయగలగాలి, మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
★ జనరల్ ఎంప్లాయ్ ఎంటిఎస్ రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ పోస్టులకు విద్యార్హత: పదవ తరగతి లేదా ఐ టి ఐ ఉత్తీర్ణత తో సంబంధిత పనిలో నైపుణ్యం కలిగి ఉండాలి.
వయసు:
1. టిజిటి సోషల్ సైన్స్ - జూలై 1, 2021 నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. టిజిటి మ్యాథమెటిక్స్ - జూలై 1, 2021 నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
3. లోయర్ డివిజన్ క్లర్క్ - జూలై 1, 2021 నాటికి 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
4. జనరల్ ఎంప్లాయి ఎంటిఎస్ రెగ్యులర్ - జూలై 1, 2021 నాటికి 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
5. జనరల్ ఎంప్లాయ్ ఎంటిఎస్ కాంట్రాక్ట - జూలై 1, 2021 నాటికి 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతాల వివరాలు:
1. టిజిటి సోషల్ సైన్స్ - రూ.44,900 - 1,42,400.
2. టిజిటి మ్యాథమెటిక్స్ - రూ.44,900 - 1,42,400/-.
3. లోయర్ డివిజన్ క్లర్క్ - రూ.19,900 - 63,200/-.
4. జనరల్ ఎంప్లాయి ఎంటిఎస్ రెగ్యులర్ - రూ.18,000 - 56,900/-
5. జనరల్ ఎంప్లాయ్ ఎంటిఎస్ కాంట్రాక్ట - రూ.21,600/-.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులకు రూ.250/-.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.08.2021.
అధికారిక వెబ్సైట్: https://sskal.ac.in/
అధికారిక నోటిఫికేషన్: https://sskal.ac.in/careers
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment