POWERGRID Apprentices Recruitment 2021 || Apply 1110 Vacancies, Check Eligibility, and more here..
పవర్ గ్రిడ్ లో 1110 అప్రెంటిస్ ఖాళీలు..
భారత ప్రభుత్వం విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న కంపెనీ అయినా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పిజిసిఐఎల్) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సంబంధిత విభాగంలో డిగ్రీ/ డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది..
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: దేశవ్యాప్తంగా 1110 ప్రకటించారు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రీజియన్ లలో ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
ట్రేడ్ ల వారిగా ఖాళీల వివరాలు, విద్యార్హత, స్టయిపెండ్, మొదలగు వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
1. ఐ టి ఐ ఎలక్ట్రికల్ - 18
1. డిప్లమా ఎలక్ట్రికల్ - 18
2. డిప్లమా సివిల్ - 4
3. గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ - 16
4. గ్రాడ్యుయేట్ సివిల్ - 6
5. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్(పే రోల్ అండ్ ఎంప్లాయి డాటా మేనేజ్మెంట్) - 13
6. గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ - 1
★ సూచన: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మొత్తంగా ఓ పిల్ల ను పైన పేర్కొనడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వారికి 43, తెలంగాణవారికి 33 ఉన్నాయి.
● పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి.
విద్యార్హతలు:
పైన పేర్కొన్న టువంటి ట్రేడ్లలో/ వివిధ విభాగాలను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో ఐటిఐ, ఇంజనీరింగ్ డిప్లమా, బీఈ/ బీటెక్/ బిఎస్సి (ఇంజనీరింగ్) ఎంబీఏ (హెచ్ఆర్) ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.
స్టయి పెండ్:
● ఐటిఐ ఎలక్ట్రికల్ లకు రూ.11,000/-
● డిప్లమా (ఎలక్ట్రికల్ & సివిల్) లకు రూ.12,000/-
● మిగిలిన వారికి రూ.15,000/- గా ప్రతినెలా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
సంబంధిత పరీక్షలు సాధించిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, వారి విశిష్ట ఈమెయిల్ ఐడి ల ద్వారా సమాచారాన్ని తెలియపరుస్తారు. తదుపరి వీరు తమ పత్రాల ధ్రువీకరణ కోసం హాజరుకావాల్సి ఉంటుంది.
ధ్రువపత్రాల ధ్రువీకరణ, మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లోనే సమర్పించాలి.
ఈ దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ముందుగా https://apprenticeshipindia.org/ https://portal.mhrdnats.gov.in/ లో రిజిస్టర్ నమోదు చేసుకుని ఉండాలి.
అక్కడ రిజిస్టర్ చేసుకున్న ఎన్రోల్మెంట్ నెంబర్ ఆధారంగా పవర్ గ్రిడ్ అప్రెంటిస్‌షిప్ కోసం.. www.powergrid.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.07.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.08.2021.
అధికారిక వెబ్సైట్: https://www.powergridindia.com/
అధికారిక నోటిఫికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి.
అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: https://www.powergridindia.com/rolling-advertisement-enagagement-apprentices
అప్రెంటిస్‌షిప్ ఇండియా హోటల్ లో రిజిస్టర్ చేసుకోవడానికి సహాయం కోసం ఈ క్రింది వీడియో చూడండి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ 04నిముషాల37సేకనులనుంది ప్రారంభమవుతుంది.
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment