Telangana Police Recruitment 2021 || అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (కేటగిరి-7) పోస్టుల నియమకానికి నోటిఫికేషన్ విడుదల.. పూర్తివివరాలివే..
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డిజిపి ఆఫీస్ కాంప్లెక్స్ లక్డికపుల్ హైదరాబాద్ నుండి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (కేటగిరి-7) పోస్టులకు ప్రత్యక్ష నియామకం కోసం అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
★ పోస్టుల వివరాలు, విద్యార్హత, పే స్కేల్ వయస్సు మరియు ఎంపిక విధానం మొదలగు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
★ పోస్ట్ పేరు: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (కేటగిరి-7),
★ మొత్తం పోస్టుల సంఖ్య: 151,
★ జీతం: పిఆర్సి 2020 ప్రకారం పే స్కేల్ రూ. 54,220-1,33,630.
★ వయసు: జూలై 1 2021 నాటికి 34 సంవత్సరాల మించకూడదు.
ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
★ విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లా ఇన్ బ్యాచిలర్ డిగ్రీ(ఎల్ఎల్బి /బిఎల్) తో పాటు ఏదైనా సబ్జెక్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలని, మరియు ఇంటర్మీడియట్ తర్వాత ఐదు సంవత్సరాల లా కోర్సును ఉత్తీర్ణులైన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
★ అనుభవం: జూలై 4, 2021 నాటికి 3 సంవత్సరాలకు తగ్గకుండా రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
★ దరఖాస్తు ఫీజు: తెలంగాణ రాష్ట్ర స్థానిక ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 750/- రూపాయలు,
మిగతా అభ్యర్థులందరికీ 1500/- రూపాయలుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
★ దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
■ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.
★ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
★ రాత పరీక్ష విధానం: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
■ పేపర్ 1:
★ మొదటి పేపర్ మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటుంది.
★ మొత్తం 100 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.
★ ఇందులో 200 ప్రశ్నలు అడుగుతారు.
★ ప్రతి ప్రశ్నకు అర మార్కు కేటాయిస్తారు.
■ పేపర్ 2:
★ రెండవ పేపర్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది.
★ మొత్తం 100 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.
■ పరీక్ష తేదీలను అధికారిక వెబ్సైట్లో త్వరలో ప్రకటించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అధికారిక వెబ్సైట్: https://www.tslprb.in/
అధికారిక నోటిఫికేషన్:
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో👇
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment