Navodaya Teaching Non Teaching Recruitment 2021 || నవోదయ విద్యాలయాల్లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేయండిలా..
నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ నుండి 2021 22 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ మరియు యుటీస్ అయినా పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ మొదలగు జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGTs)
◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (TGTs)
◆ క్రియేటివ్ టీచర్
◆ ఒకేషనల్ టీచర్
◆ ఫ్యాకల్టీ-కం-సిస్టమ్-అడ్మినిస్ట్రేటర్ (FCSA).. మొదలగునవి...
విద్యార్హత:
◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGTs) పోస్టులకు విద్యార్హత: 50 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ తో బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (TGTs) పోస్టులకు విద్యార్హత: 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ మరియు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
★ సీ టెట్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
◆ క్రియేటివ్ టీచర్
◆ ఒకేషనల్ టీచర్
◆ ఫ్యాకల్టీ-కం-సిస్టమ్-అడ్మినిస్ట్రేటర్ (FCSA) పోస్టులకు విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ తో PGDCA "A"-గ్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
★ బిసిఎ/ బిఎస్సి/ బీటెక్/ బిఈ/ ఎంసీఏ డిగ్రీలను సంబంధిత విభాగంలో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తులు చేసుకోవచ్చు..
వయసు:
★అన్ని కేటగిరీల టీచర్ పోస్టులకు జూలై 1 2021 నాటికి 50 సంవత్సరాలు,
★ ఎక్స్-సర్వీస్ ఎన్విఎస్ టీచర్లకు జూలై 1 2021 నాటికి 22 సంవత్సరాలకు మించకూడదు.
★ అలాగే FCSA లకు జూలై 1 2021 నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు.
జీతం:
◆ పోస్ట్ గ్రాడ్యూవెట్ టీచర్లకు రూ.35,750/-,
◆ ట్రైనీ గ్రాడ్యూవెట్ టీచర్, క్రియేటివ్ స్టాఫ్ మరియు ఫ్యాకల్టీ-కం-సిస్టమ్-అడ్మినిస్ట్రేటర్ లకు రూ.34,125/-ప్రతి నెలా చెల్లిస్తారు.
◆ పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూ ల ద్వారా..
అధికారిక నోటిఫికేషన్ :
అధికారిక వెబ్సైట్ : https://navodaya.gov.in/
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్ : https://schooms.in/jnv/hyderabad/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.07.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11.07.2021.
ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ: త్వరలో అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు.
ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించు సమయం: ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 05:30 గంటల వరకు.
Comments
Post a Comment