CSIR Recruitment 2021 || ఇంటర్మీడియట్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
CSIR-Indian institute of Chemical Technology ఉప్పల్ రోడ్, తార్నాక, హైదరాబాద్ నుండి.. పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది..
ఈ ఉద్యోగాలకు 2 తెలుగు రాష్ట్రాల స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు, విద్యార్హత, జీతం మొదలగు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 18.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
■ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(GEN) - 10,
విద్యార్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో నిమిషానికి 35 పదాలు ఇంగ్లీషులో, 30 పదాలు హిందీలో కంప్యూటర్ పై టైప్ చేయగల పరిజ్ఞానం కలిగి ఉండాలి.
■ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(F&A) - 05,
విద్యార్హత: ఇంటర్మీడియట్ విద్యార్హతతో అకౌంటెన్సీ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణత తో నిమిషానికి 35 పదాలు ఇంగ్లీషులో, 30 పదాలు హిందీలో కంప్యూటర్ పై టైప్ చేయగల పరిజ్ఞానం కలిగి ఉండాలి.
■ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(S&P) - 05,
విద్యార్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో నిమిషానికి 35 పదాలు ఇంగ్లీషులో, 30 పదాలు హిందీలో కంప్యూటర్ పై టైప్ చేయగల పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయసు: ఆగస్టు 8, 2021 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు.
అధిక వయసు కలిగిన రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కల్పించారు పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
జీతం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.29,000/- వరకు ప్రతినెలా చెల్లిస్తారు.
మరియు HRA, DA, TA కూడా వర్తిస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష మరియు కంప్యూటర్ టైప్ రైటింగ్ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పై మూడు రకాల పోస్టులకు పరీక్ష సిలబస్, పేపర్ ప్యాట్రన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
★ పరీక్ష ప్యాట్రన్: ఓఎంఆర్ బేస్డ్/ కంప్యూటర్ బేసిక్స్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో పేపర్ ఉంటుంది.
★ పరీక్ష పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఉంటుంది.
★ ఇంటర్మీడియట్ స్థాయిలో పరీక్ష పేపర్ ఉంటుంది
★ ఇందులో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి , పేపర్-1 , పేపర్-2.
★ మొత్తం 200 మార్కులకు ఈ పరీక్ష పేపర్లు ఉంటాయి.
★ పరీక్ష సమయం: 02:30 గంటలు.
మొదటి పేపర్: పేపర్-1:-
★ దీనికి 90 నిమిషాలు కేటాయించారు.
★ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రిటర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచువేషన్ అల్ జడ్జిమెంట్, మొదలగు అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
★ ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు.
★ ఈ పరీక్షలో నెగిటివ్ మార్కులు లేవు.
రెండవ పేపర్: పేపర్-2:-
★ దీనికి 1 గంట సమయం కేటాయించారు
★ జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 50 ప్రశ్నలు,
★ జనరల్ ఇంగ్లిష్ నుండి 50 ప్రశ్నలు అడుగుతారు.
★ ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు.
★ ఈ పరీక్ష పేపర్ కు నెగిటివ్ మార్కులు ఉన్నాయి.
★ ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి, మరియు అదే హార్డ్ కాపీ ను సంబంధిత సర్టిఫికెట్లతో self-attested మార్కెట్లను జతచేసి, సెక్షన్ ఆఫీసర్, సెక్రటేరియట్ సెక్షన్, సిఎస్ఐఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఉప్పల్ రోడ్, తార్నాక, హైదరాబాద్-500007, తెలంగాణ. అడ్రస్‌కు ఆగస్టు 23, 2021 ముందు చేరుకునే విధంగా పంపించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.07.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08.08.2021,
హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీ: 23.08.2021.
అధికారిక వెబ్సైట్: https://iictindia.org/
అధికారిక నోటిఫికేషన్:
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://www1.csiriict.in/jsa-2021/
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొ చూడండి..
Comments
Post a Comment