UGC Recruitment 2021 || యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో నెలకు రూ.50,000 వేతనంతో ఉద్యోగాలు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ -యూజీసీ వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
పోస్ట్ పేరు: జూనియర్ కన్సల్టెంట్స్,
పోస్టుల సంఖ్య: 08,
జీతం: రూ.50,000 - 60,000/- ప్రతి నెల.
అర్హత ప్రమాణాలు:
● గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. డిస్టెన్స్ ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పై అవగాహన, ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి పరిజ్ఞానం ఉండాలి.
● MS-Office/ Excell/ ఇంటర్నెట్ వాడకం మొదలైన విషయాల పట్ల పరిజ్ఞానం అవసరం.
● బహుళ కార్యాచరణ వాతావరణంలో పని చేయగల సామర్థ్యం ఉండాలి.
వయసు:
జూలై 12, 2021 నాటికి దరఖాస్తుదారుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
విధులు:
◆ రెగ్యులేషన్స్ మరియు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఉన్నత విద్య మరియు డిస్టెన్స్/ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన పరిపాలన పనులను నిర్వహించడానికి కమిషన్కు సహాయం చేయడం.
◆ దూరవిద్య/ ఆన్లైన్ విద్య కార్యక్రమాలను అందించే విశ్వవిద్యాలయాలు/ ఇన్స్టిట్యూట్ లను పర్యవేక్షించడంలో సహాయపడటం.
◆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్/ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధిత విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు/ విద్య మంత్రిత్వ శాఖతో అనుసంధానాన్ని నిర్వహించడం.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12.07.2021.
ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి క్రింది సోపానాలను అనుసరించండి.
1. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్:
2. అధికారిక వెబ్సైట్ లోని మెయిన్ మెనూ లో కనిపిస్తున్న 'జాబ్' లింక్ పై క్లిక్ చేయండి.
3. తరువాతి పేజీ లో నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాని పక్కనే కనిపిస్తున్న 'అప్లై ఆన్లైన్' లింక్ పై క్లిక్ చేయండి.
4. దరఖాస్తు ప్రక్రియ నాలుగు దశలుగా ఉంటుంది.
★ మొదటి దశలో పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొదలగు వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
★ రెండవ దశలో విద్యార్హత వివరాలకు సంబంధించిన సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
★ మూడవ దశలో ఉద్యోగ సమాచారం, అనుభవం మొదలగు విషయాలను నమోదు చేయాలి.
★ నాలుగవ దశలో డిక్లరేషన్ను సమర్పించి దరఖాస్తు ప్రక్రియ విజయవంతం చేయడం.
భవిష్యత్ కార్యాచరణ కోసం దరఖాస్తులను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోండి.
ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు.
కాంట్రాక్టు గడువు వివరాలు మొదటి ఆరు నెలల కోసం నియమిస్తారు, ఆ తరువాత పని తీరును బట్టే కాంట్రాక్ట్ ను తొలగిస్తారు.
జీతం: ప్రతి నెల రూ.50,000 - 60,000/- చెల్లిస్తారు.
పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
అధికారిక నోటిఫికేషన్:
అధికారిక వెబ్సైట్: https://www.ugc.ac.in/
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://www.ugc.ac.in/hrrecruit/
Comments
Post a Comment