NABARD Grade A Recruitment 2021 || Apply 162, Assistant manager posts.
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) నుండి మొత్తం 162 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు విధానం, వయోపరిమితి, విద్యార్హత, అనుభవం, ఎంపిక ప్రక్రియ మొదలగు వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
నాబార్డ్ రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్:
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్) గ్రేడ్ 'ఏ' అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి తన అధికారిక వెబ్సైట్ www.nabard.org ద్వారా జూలై 17, 2021 నుండి ఆగస్ట్ 7, 2021 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి, ఆన్లైన్ అప్లికేషన్ లింకులను ఆక్టివేట్ చేసింది.
దరఖాస్తు చేసుకోవడానికి ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా ఈ పేజీ చివరన ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి, అధికారిక నోటిఫికేషన్ చదివి, మరియు వారు దరఖాస్తు చేయబోయే పోస్టుకు సంబంధించిన అన్ని అర్హత ప్రమాణాలను కలిగిఉంటే, దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు.
నాబార్డ్ రిక్రూట్మెంట్ 2021 ఖాళీల వివరాలు:
■ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(గ్రామీణ అభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్) - 148,
■ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(రాజ భాష సర్వీస్) - 5,
■ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(ప్రోటోకాల్ మరియు సెక్యూరిటీ సర్వీస్) - 2,
■ మేనేజర్ గ్రేడ్ బి(గ్రామీణ అభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్) - 7.
నాబార్డ్ రిక్రూట్మెంట్ 2021 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు విద్యార్హత:
★ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(గ్రామీణ అభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
★ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(రాజ భాష సర్వీస్) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత భాషలో రెండు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ కోర్సును పూర్తి చేసి ఉండాలి.
★ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(ప్రోటోకాల్ మరియు సెక్యూరిటీ సర్వీస్) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్మెన్ ఐడెంటి కార్డు కలిగి ఉన్న ఆర్మీ/ నేవి వైమానిక దళంలో కనీసం 5 సంవత్సరాల సర్వీసు ఉన్న అధికారులే ఉండాలి
★ మేనేజర్ గ్రేడ్ బి(గ్రామీణ అభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ, పిజి మరియు ప్రొఫెషనల్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
📢 Must Read: SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.
నాబార్డ్ రిక్రూట్మెంట్ 2021 గ్రేడ్ ఏ మరియు గ్రేడ్ బి పోస్టులకు వయసు:
■ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(గ్రామీణ అభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్) పోస్టులకు 21 నుండి 30 సంవత్సరాలు.
■ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(రాజ భాష సర్వీస్) పోస్టులకు 21 నుండి 30 సంవత్సరాలు.
■ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(ప్రోటోకాల్ మరియు సెక్యూరిటీ సర్వీస్) పోస్టులకు 25 నుండి 40 సంవత్సరాలు.
■ మేనేజర్ గ్రేడ్ బి(గ్రామీణ అభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్) 25 నుండి 32 సంవత్సరాలు.
నాబార్డ్ రిక్రూట్మెంట్ 2021 గ్రేడ్ ఏ, గ్రేడ్ బి పోస్టులకు ఎంపిక విధానం:
ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
నాబార్డ్ రిక్రూట్మెంట్ 2021 గ్రేడ్ ఏ, గ్రేడ్ బి దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూలై 17, 2021 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 7, 2021.
నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ, వారికి పరీక్ష తేదీ: ఆగస్టు చివరి వారం/ సెప్టెంబర్ మొదటి వారంలో.
నాబార్డ్ మేనేజర్ గ్రేడ్ బి, వారికి పరీక్ష తేదీ: ఆగస్టు చివరి వారం/ సెప్టెంబర్ మొదటి వారంలో.
అధికారిక వెబ్సైట్: https://www.nabard.org/
అధికారిక నోటిఫికేషన్:
■ నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(గ్రామీణ అభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్)/ (రాజ భాష సర్వీస)
■ నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్(ప్రోటోకాల్ మరియు సెక్యూరిటీ సర్వీస్)
■ నాబార్డ్ మేనేజర్ గ్రేడ్ బి(గ్రామీణ అభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్)
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here

















































Comments
Post a Comment