NEET UG 2023 | నీట్ యూజీ నోటిఫికేషన్ వచ్చింది | దరఖాస్తు విధానం ఇదే | Easy Register Full Process here..
![]() |
NEET UG 2023 | Easy Register Full Process here.. |
దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కామ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET UG 2023 నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ..
NEET UG 2023 ముఖ్యాంశాలు:
- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీఏజెన్సీ NEET UG 2023 ఆన్లైన్ దరఖాస్తులను 06.03.2023 నుండి ప్రారంభించింది.
- అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 06.04.2023 రాత్రి 09:00 గంటల వరకూ సమర్పించవచ్చు.
- దరఖాస్తు సవరణలకు అవకాశం త్వరలో అధికారిక వెబ్ సైట్ లో అప్ డేట్ చేయబడుతుంది.
- మొత్తం 200 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది.
- ఫిజిక్స్, కెమిస్ట్రీ & బయాలజీ (బోటనీ & జువాలజీ) నుండి ప్రతి సబ్జెక్టు 50 ప్రశ్నల చొప్పున సెక్షన్-(ఎ ,& బి) విధానంలో ప్రశ్నలు అడుగుతారు.
- పేపర్ పెన్ ను విధానంలో పరీక్ష ఉంటుంది.
- పరీక్ష తేదీతేదీ : 07.05.2023(ఆదివారం).
- పరీక్షా సమయం 200 నిమిషాలు. (3 గంటల 20 నిమిషాలు).
- పరీక్షా సమయం మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు.
NEET UG 2023: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం (సైన్స్) చదువుతున్న అభ్యర్థులు, MBBS, BDS, BSMS, BUMS, BAMS కోర్సుల్లో అడ్మిషన్స్ కు NEET UG 2023 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైనది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పై కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించాల్సి ఉంటుంది.
దేశ వ్యాప్తంగా 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అవి;
- ఇంగ్లీష్,
- తెలుగు,
- ఉర్దూ,
- హిందీ,
- అస్సామీ,
- బెంగాలీ,
- గుజరాతి,
- కన్నడ,
- మలయాళం,
- మరాఠీ,
- ఒడియా,
- పంజాబీ,
- తమిళ్.. మొదలగునవి.
విద్యార్హత:
- ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం (సైన్స్) కోర్సు చదువుతూ/ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
- 31.12.2006 కు ముందు జన్మించి ఉండాలి. (లేదా) 17 సంవత్సరాల వయసు అతడు/ ఆమె పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
1st - PG Admissions 2023-24!
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ఆసక్తి కలిగిన విద్యార్థిని/ విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://neet.nta.nic.in/
- అధికారిక Home పేజీ లోని దిగువన కనిపిస్తున్న Candidate Activity లోని, NEET (UG) 2023 Registration లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పేజీలోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- రిజిస్టర్ కావడానికి దిగువన కనిపిస్తున్న New Registration లింక్ పై క్లిక్ చేయండి.
- దరఖాస్తు చేయడానికి ముందు సూచనలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది క్రింద కనిపిస్తున్న డిక్లరేషన్ పై ✓క్లిక్ చేసి, Click here to Proceed బటన్ పై క్లిక్ చేయండి.
- ఆన్లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ 3 స్టెప్స్ లో ఉంటుంది.
- ముందుగా రిజిస్ట్రేషన్, తదుపరి అప్లికేషన్ ఫామ్ పూర్తిచేయడం, చివరిలో పేమెంట్ చేసి సబ్మిట్ చేయాలి.
- ఇప్పుడే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ కేటగిరి అభ్యర్థులకు రూ.1,700/-,
- జనరల్, ఈడబ్ల్యూఎస్, బిసి-(నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు రూ.1,600/-,
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూడి/ థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.1000/-,
- ఇతర దేశాల అభ్యర్థులైతే రూ.9,500/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.04.2023 రాత్రి 09:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://neet.nta.nic.in/
అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
డైరెక్టుగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment