TS Medical Staff Recruitment 2021 | No Exam Required | Apply 45 Vacancies of Pharmacist Gr-౹౹ Lab Technician Gr-౹౹ | Check Eligibility details here..
తెలంగాణ మెడికల్ సిబ్బంది ఉద్యోగ నియామకాలు | ఎటువంటి పరీక్ష లేకుండా, అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక | ఇంటర్మీడియట్ తో పాటు డిఫార్మసీ/ బిఫార్మసీ అర్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేయవచ్చు | పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం (డీ.ఎం.హెచ్.ఓ) నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 31.03.2022 వరకు విధులు నిర్వర్తించడానికి అర్హత ఆసక్తిగల అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆఫ్లైన్లో ఆహ్వానిస్తూ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నల్గొండ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 45,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఫార్మాసిస్ట్ గ్రేడ్-౹౹ - 08,
2. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-౹౹ - 37.
★ ఫార్మాసిస్ట్ గ్రేడ్-౹౹ పోస్టులకు విద్యార్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తోపాటు డిఫార్మసీ / బిఫార్మసీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మరియు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
★ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-౹౹ పోస్టులకు విద్యార్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తోపాటు డిఎంఎల్టి/ బిఎస్సి(ఎంఎల్టీ) ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మరియు పారామెడికల్ బోర్డు లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: జూలై 1 2021 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
1. ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు.
2. మాజీ సైనికులకు 3 సంవత్సరాలు.
3. వికలాంగులకు 10 సంవత్సరాలు.
పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. అకడమిక్ అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, వయసు, ఆర్డర్ ఆఫ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.07.2021,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.08.2021.
ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: ఉదయాదిత్య భవనం, కలెక్టర్ కార్యాలయం, మిర్యాలగూడ రోడ్, నల్లగొండ.
అధికారిక వెబ్సైట్: https://nalgonda.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి/ చదవండి.
దరఖాస్తు ఫారం: ఇక్కడ క్లిక్ చేయండి.
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment