Telangana Anganwadi Recruitment 2021 | Apply Anganwadi (Teacher, Mini Teacher, Helper) posts | No Exam Required | 10th pass can apply online | All Required Eligibility details read here..
తెలంగాణ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పదవ తరగతి విద్యార్హతతో అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, సహాయకురాలు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 16.08.2021. | నోటిఫికేషన్ , దరఖాస్తు విధానం, దరఖాస్తు చేసుకునే టప్పుడు సమర్పించవలసిన ధృవపత్రాలు, మొదలగు పూర్తి సమాచారాన్ని ఈ పేజీలో చదవండి.
తెలంగాణ అంగన్వాడి రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ వివరాలు:
మహిళా శిశు దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ నల్లగొండ జిల్లా నుండి మొత్తం 9 అంగన్వాడీ సెంటర్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ తేదీ: 30.07.2021.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 109 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి నల్గొండ జిల్లాలోని 9 ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాల పరిధిలో ఉన్న స్థానిక ప్రాంత నివాసులైన మహిళా అభ్యర్థుల ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఖాళీలు అర్హతలు మరియు ఇతర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://wdcw.tg.nic.in/ https://mis.tgwdcw.in/#
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 109,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
అంగన్వాడి టీచర్ పోస్టులు - 23,
మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు - 07,
అంగన్వాడి సహాయకురాలు - 79..
పైన తెలిపిన టువంటి పోస్టులకు దిగువ తెలిపిన ప్రాజెక్టులలో ఖాళీగా సూచించారు.
1. అనుముల ప్రాజెక్టు - 11,
2. చింతపల్లి ప్రాజెక్ట్ - 13,
3. దామరచర్ల ప్రాజెక్ట్ - 17,
4. దేవరకొండ ప్రాజెక్ట్ - 10,
5. కొండ మల్లేపల్లి ప్రాజెక్ట్ - 9,
6. మిర్యాలగూడ ప్రాజెక్ట్ - 8,
7. మనుగోడు ప్రాజెక్ట్ - 7,
8. నకిరేకల్ ప్రాజెక్ట్ - 17,
9. నల్లగొండ ప్రాజెక్ట్ - 17..
వివరణాత్మక సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, నోటిఫికేషన్ ను చదవండి, నోటిఫికేషన్లో ప్రాజెక్టుల వారీగా వివరించిన పోస్టుల వివరాలు ఉన్నాయి..
అర్హతలు:
అంగన్వాడి పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాసై వివాహిత అయి ఉండాలి.
వయసు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు ఆగస్టు 1, 2021 నాటికి 21 సంవత్సరాలు నుండి 31 సంవత్సరాలు మించకుండా ఉండాలి. మరియు తప్పనిసరిగా ఆయా గ్రామాల్లో/ గ్రామ పంచాయతీల్లో/ సంబంధిత వార్డుల్లో నిర్వహిస్తూ ఉండాలి. ఒకవేళ దరఖాస్తుదారులు దివ్యాంగులు అయితే వినికిడి పరికరాన్ని ఉపయోగించి కలిగినవారు/ ఆంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించే గలిగేవారు/ కళ్ళు చేతులకు సంబంధించే అంగవైకల్యం ఉన్నప్పటికీ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు విద్యను అందించడానికి కానీ పిల్లల సంరక్షణకు కానీ ఎటువంటి ఆటంకం లేదని నిరూపించే వారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు చెందిన అంగన్వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల లో 21 సంవత్సరాలు నిండిన వారు లేకపోతే.. 18 సంవత్సరాలు నిండిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. (కాబట్టి ఈ పోస్టులకు 18 సంవత్సరాలు నిండిన వారు కూడా దరఖాస్తు చేసుకోండి.)
దరఖాస్తు విధానం:
◆ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
◆ దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించడానికి చివరి తేదీ: 16.08.2021.
◆ ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించినవారు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో తప్పనిసరిగా ఆన్లైన్ దరఖాస్తు ఫారం తో కూడిన తమ ధృవ పత్రాలను 20.08.2021 నుండి 30.08.2021 వరకు స్క్ర్టుని చేయించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకుని స్క్ర్టుని చేయించుకొని వారి దరఖాస్తులు పరిగణించబడవు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పిస్తున్న అప్పుడు జత పరచవలసిన ధ్రువ పత్రాలు.
1. పుట్టిన తేదీ/ వయసు ధ్రువీకరణ పత్రము,
2. కుల దృవీకరణ పత్రము,
3. విద్యార్హత దృవీకరణ పత్రము, పదవ తరగతి మార్కుల జాబితా,
4. నివాస ధ్రువీకరణ పత్రం,
5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి ధ్రువీకరణ పత్రము,
6. వికలాంగులు అయితే సంబంధిత మెడికల్ సర్టిఫికేట్ కాపీలను అప్లోడ్ చేయాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.
అధికారిక వెబ్సైట్: https://wdcw.tg.nic.in/ https://mis.tgwdcw.in/#
అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి/ చదవండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://mis.tgwdcw.in/Recruit.aspx
Comments
Post a Comment