భారత ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు.. 379 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. Indian Army SSC Technical Notification Out! Apply here..
భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన ఇండియన్ ఆర్మీ, అవివాహిత మహిళ/ పురుష అభ్యర్థుల నుండి అక్టోబర్ 2025న ప్రారంభం కాబోతున్న షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీచేసింది.
📌 సంవత్సరానికి 2 సార్లు ఇండియన్ ఆర్మీ టెక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరిస్తుంది రక్షణ రంగంపై ఆసక్తి ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ తో ఎంపికలు చేస్తారు, ముందుగా శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం పీజీ డిప్లోమా సర్టిఫికెట్ అందుకొని లెఫ్టినెంట్ హోదా ఉద్యోగం పొందవచ్చు.
నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 379.
- పురుషులకు - 350,
- మహిళలకు - 29 (ఆర్మీ వీడోలకు 2).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- పోస్టులను అనుసరించి అభ్యర్థులు 01.11.2025 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాల మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- షార్ట్ లిస్టింగ్, మెడికల్ పరీక్షల ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రకటించి, ఇండియన్ ఆర్మీ నిబంధనల ప్రకారం ఎంపికలు చేస్తారు.
షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మహిళలు/ పురుషులు రిక్రూట్మెంట్ ముఖ్యాంశాలు :
📌 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకు బెంగుళూరులో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
👉 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అక్టోబర్ 2025 నుండి శిక్షణ ప్రారంభమవుతుంది.
👉49 వారాలపాటు ట్రైనింగ్ ఇస్తారు.
👉ట్రైనింగ్ పీరియడ్ పూర్తి చేసుకున్న వారికి పోస్ట్ 👉గ్రాడ్యుయేట్ డిప్లొమా డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీ ను మద్రాస్ యూనివర్సిటీ నుండి అందుకోవచ్చు.
👉అలాగే శిక్షణ పూర్తి చేసుకుని డిగ్రీ పట్టా అందుకున్న అభ్యర్థులను లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి జాయిన్ చేసుకుంటారు.
👉ఇక్కడ పది సంవత్సరాలు ఉద్యోగంలో కొనసాగవచ్చు, అనంతరం సంస్థ అవసరాలు అభ్యర్థుల ఆసక్తి మేరకు వారిలో కొందరిని శాశ్వత విధుల్లోకి తీసుకుంటారు.
👉మిగిలిన వారికి మరో 4 సంవత్సరాల పాటు సర్వీస్ పొడిగిస్తారు.
📌లెఫ్టినెంట్ పోస్టులో అపాయింట్మెంట్ అయిన వారు 2 సంవత్సరాల అనుభవంతో కెప్టెన్, 6 సంవత్సరాలు విజయవంతంగా సేవలందించడంతో మేజర్, 13 సంవత్సరాలు అలాగే కొనసాగితే లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు చేరుకోవచ్చు.
👉ప్రారంభం నుండి అన్ని అలవెన్స్ తో కలిపి సుమారు 1.5 లక్షలు వేతనంగా అందుకోవచ్చు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో రూ.56,100/- వేతనంగా చెల్లిస్తారు.
- శిక్షణ అనంతరం సంవత్సరానికి 18 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.01.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.02.2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://joinindianarmy.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment