TG TW Gurukulam Inter Admissions ‖ తెలంగాణ గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు దరఖాస్తు కు ఇంకొద్దిరోజులే అవకాశం.. దరఖాస్తు చేయండిలా..
తెలంగాణ గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 76 తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో 2021 - 22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (జనరల్ ,వృత్తి విద్యా, కోర్సులు) లో ప్రవేశానికి అధికారికంగా నోటిఫికేషన్ వెలువడింది.
కోర్సులు: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, వృత్తి విద్యా కోర్సులు.
అర్హత: మార్చి 2021 లో పదవ తరగతి పరీక్ష లకు హాజరవుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
➥ అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి రూ. 2,00,000/- గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి 1,50,000/- రూపాయలకు వార్షిక ఆదాయం మించకూడదు.
➥ 2021 ఆగస్టు 31 నాటికి అభ్యర్థుల వయసు 17 సంవత్సరాలు దాటకూడదు.
రిజర్వేషన్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఎంపిక విధానం : ప్రవేశ పరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
➥ ప్రశ్నపత్రం తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది.
➥ ఇంటర్ చదవాలనుకుంటున్నాను సబ్జెక్టును అనుసరించి ప్రశ్నపత్రం గ్రూప్ ను ఎంపిక చేసుకోవాలి.
ఉదాహరణకు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చదవాలనుకునేవారు ఎంపీసీ, డాక్టర్ కోర్సు చేయాలనుకునేవారు బైపిసి ఎంపికచేసుకోవాలి.
➥ దరఖాస్తు సమయంలో అభ్యర్థి ఎంచుకున్న గ్రూప్ మేరకు ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం ఉంటుంది.
➥ ప్రశ్నలన్నీ పదో తరగతి సిలబస్ కు లోబడి ఉంటాయి.
ఇది కూడా చదవండి : మీ MLC ఓటు స్టేషన్ నెంబర్, సీరియల్ నెంబర్ తెలుసుకోవడం ఎలా?.. సులువైన పద్దతిలో తెలుసుకోవడానికి చదవండి....
పరీక్షా విధానం:
➥ ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానం లో ఉంటుంది.
➥ ఎంపీసీ, బైపిసి అభ్యర్థులకు విడివిడిగా ప్రశ్నాపత్రం ఉంటుంది.
➥ ఎంపీసీ వారికి ఇంగ్లీష్ నుండి 20, ఫిజిక్స్ నుండి 20, కెమిస్ట్రీ నుండి 20, మేథ్స్ నుండి 20 ప్రశ్నలు వస్తాయి.
➥ అదే విధంగా బైపిసి వారికి ఇంగ్లీష్ నుండి 20, ఫీజిక్స్ నుండి 20, కెమిస్ట్రీ నుండి 20, బయాలజీ నుండి 20 ప్రశ్నలు వస్తాయి.
➥ ఈ పరీక్షను 11.04.2021 న నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.
➥ అయితే IIT/ COEs లో చేరాలనుకుంటే అభ్యర్థులు రెండో స్క్రీనింగ్ టెక్స్ట్ ను కూడా రాయవలసి వస్తుంది. ఇందులో ప్రతిభ చూపించిన వారికి IIT/ COEs లో ప్రవేశం పొందవచ్చు.
దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : ₹ 100/-
దరఖాస్తు చేయడానికి కావలసిన వివరాలు:
1. విద్యార్ధి పేరు ఇంటిపేరు తో కలిపి.
2. బోనఫైడ్ లో ఉన్న పుత్తిన తేదీ.
3. మొబైల్ నెంబర్.
4. ఇంటర్మీడియట్ లో తీసుకునే గ్రూపు.
5. విద్యార్ది ప్రస్తుతం చదువుతున్న స్కూల్ పేరు.
6. విద్యార్ధి ఆధార్ నెంబర్.
7. తండ్రి పేరు.
8. తల్లి పేరు.
9. గ్రామం పేరు.
10. మండలం పేరు.
11. జిల్లా పేరు.
12. పోస్ట్ బాక్స్ నెంబర్.
13. క్యాస్ట్ గ్రూప్.
14. విధ్యార్ధి ఫోటో, సంతకం.
15. 10 వ తరగతిలో విధ్యార్ధి చదివిన మీడియం.
దరఖాస్తు చేసుకునే విధానం కోసం క్రింది వీడియో చూడండి.
దరఖాస్తు చేసుకోవడానికి క్రింది సోపానాలను అనుసరించండి.
1. అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్సైట్ లింక్ : tgtwgurukulam.telangana.gov.in
3. దరఖాస్తు చెసుకోవడానికి డైరెక్ట్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి
4. ఫీ పే లోనెక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫీజు ను ఆన్లైన్ లో చెల్లించండి.
5. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తును ఆన్లైన్ లో విజయవంతంగా సబ్మిట్ చేయండి.
Comments
Post a Comment