WDCW Extension Officer Grade-2 Hall Tickets Out || Check your Exam center details || Download hall tickets here..
తెలంగాణ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ విడుదల చేసినటువంటి 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2(సూపర్వైజర్) పోస్టుల భర్తీకి హాల్ టికెట్లు విడుదల..
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2, (సూపర్వైజర్) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 6 2021 నుండి ప్రారంభమైంది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 27వ తేదీన చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2, ఉద్యోగాలను భర్తీ చేయనుంది.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, పరీక్ష తేదీకి ముందు గా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, ప్రకటనలో తెలిపింది.
రాతపరీక్షను జనవరి 2, 2022 నా ఉదయం 11:30 గంటలకు నుండి మధ్యాహ్నం 01:00 నిర్వహిస్తుంది.
💧ఈ పరీక్ష మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది.
💧మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంబంధిత విభాగాల నుండి మొత్తం 90 ప్రశ్నలు వస్తాయి.
💧పరీక్ష సమయం 90 నిమిషాలు ఉంటుంది.
💧ప్రతి ప్రశ్నకు1/2 మార్క్ కేటాయిస్తారు.
💧ఇలా మొత్తం 45 మార్పులను, అభ్యర్థులు స్కోర్ చేయాల్సి ఉంటుంది.
హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు మీ పరీక్ష సెంటర్ వివరాలను తనిఖీ చేయండి.
తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాలలో నే ఈ పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
అధికారిక వెబ్సైట్: https://wdcw.tg.nic.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు వివరాలు వీడియొలో👇...
275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-II (సూపర్వైజర్) దరఖాస్తు విధానం వీడియొ.. మీ సంధెహాలను ఈ వీడియొ చూసి నివృత్తి చేసుకోండీ.. 👇...
హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2, హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయండి.
3. దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీ, పైన కనిపిస్తున్న కోడ్ను ఎంటర్ చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.
4. మీ హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది.
5. డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేసి, డౌన్లోడ్ చేయండి.
హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: https://tswdcw.in/SiteContent/frmHome
Comments
Post a Comment