Admissions 2022 | గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి క్రీడా పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | దరఖాస్తు విధానంఇదే..
గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి క్రీడా పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.
హైదరాబాద్ లోని గిరిజన గురుకుల సంక్షేమ విద్యాలయ సంస్థ, తెలంగాణలోని 2 క్రీడా పాఠశాలలో (బాలురు & బాలికలు) విద్యా సంవత్సరం 2022-23 కు గాను 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. ప్రవేశాలు రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు, ఆసక్తి కలిగిన 2021-22 విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసిన, విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తులు చేయవచ్చు.. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 2వ తేదీ నుండి ప్రారంభమైంది దరఖాస్తులకు జూలై 8 చివరి తేదీగా నిర్ణయించారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని కోవాలని మన వెబ్ సైట్ ద్వారా తెలియపరుస్తున్నాను.. ఈ విద్యా సంస్థల్లో విద్యార్థుల అభివృద్ధికి తగ్గట్లుగా ప్రత్యేక క్రీడా శిక్షణ మరియు అక్కడే విద్యాభ్యాసం అందించడం జరుగుతుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, సీట్ల సంఖ్య, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు:
సీట్ల సంఖ్య: 80,
★ TTWURJC (B) ఎటునగరం క్రీడా పాఠశాల - 40,
★ TTWURJC (G) చేగుంట క్రీడా పాఠశాల - 40.
ఇక్కడ ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ భోజన వసతి సదుపాయాలు తో.. 2 జతల పిటి డ్రస్సులు, 1 ట్రాక్ షూట్, బూట్లు, బ్యాగ్, వాటర్ బాటిల్, టవల్ మొదలగునవి అందిస్తారు..
విద్యార్థిని విద్యార్థులు గిరిజన సంక్షేమ గురుకుల క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఈ క్రింది అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
విద్యార్హత:
◆ 2021-22 విద్యా సంవత్సరంలో 4వ తరగతి తప్పనిసరిగా పూర్తిచేసి ఉండాలి.
◆ నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
◆ ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, 4వ తరగతి మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సిద్ధంగా ఉండాలి.
★ విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 2,00,000/- మించకుండా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 1,50,000/-మించకుండా ఉండాలి.
Must read :: JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://www.tgtwgurukulam.telangana.gov.in/
◆ Latest Notifications లో స్క్రోల్ అవుతున్న 5వ తరగతి క్రీడా పాఠశాల ప్రవేశాలకు సంబంధించిన లింక్ పై క్లిక్ చేయండి.
◆ దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ మరలా చదివి, ఆన్లైన్ అయితే చెల్లించాలి.
◆ ఆన్లైన్ దరఖాస్తు ఫీజు ₹.50/-.
◆ తదుపరి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి, విద్యార్థి వ్యక్తిగత విద్యార్హత వివరాలు నమోదు చేస్తూ, ఫోటో, సిగ్నేచర్.. లను అప్లోడ్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
◆ దరఖాస్తులో భాగంగా పాస్పోర్ట్ సైజ్ అప్లోడ్ చేస్తున్నటువంటి ఫోటో 100kb, సంతకం 50kb మించకుండా ఉండాలి
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఈవెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.. రాత పరీక్ష తేదీలు ప్రకటించాల్సి ఉంది. త్వరలో అప్డేట్ అవుతాయి..
★ సంబంధిత సమాచారం మన వెబ్సైట్ ద్వారా అప్డేట్ అందించడం జరుగుతుంది..
తాజా ఉచిత - విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.07.2022 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08.07.2022.
అధికారిక వెబ్సైట్: https://www.tgtwgurukulam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులో భాగంగా ఆన్లైన్ ఫీజు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment