IBPS Clerk Recruitment 2022 | డిగ్రీ తో 7855 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలివే..
గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త!
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న పదకొండు ప్రభుత్వ బ్యాంకుల్లో(బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యుసిఓ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర) మొదలగు బ్యాంకుల్లో క్లర్క్ ఖాళీల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా (CRP Clerk XII Posts) ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ ప్రకటనను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ రోజు నుండి దరఖాస్తులు ప్రారంభించవచ్చు, జూలై 21న దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు, సిలబస్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
తాజా ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందడానికి మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 7855,
రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు:
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు:
★ ఆంధ్ర ప్రదేశ్ - 209,
★ తెలంగాణ - 99,
◆ అండమాన్ & నికోబార్ - 04
◆ అరుణాచల ప్రదేశ్ - 14,
◆ అస్సాం - 157,
◆ బీహార్ - 281,
◆ చండీగర్ - 12,
◆ చత్తీస్ ఘర్ - 104,
◆ దాద్రా నగర్ హవేలీ డామన్ & డ్యూఈ - 01,
◆ ఢిల్లీ - 295,
◆ గోవా - 71,
◆ గుజరాత్ - 304,
◆ హర్యానా - 138,
◆ హిమాచల్ ప్రదేశ్ - 91,
◆ జమ్ము & కాశ్మీర్ - 35,
◆ జార్ఖండ్ - 69,
◆ కర్ణాటక - 358,
◆ కేరళ -70,
◆ లడక్ - 0,
◆ లక్షద్వీప్ - 05,
◆ మధ్యప్రదేశ్ - 309,
◆ మహారాష్ట్ర - 775,
◆ మణిపూర్ - 04,
◆ మేఘాలయ - 06,
◆ మిజోరాం - 04,
◆ నాగాలాండ్ - 04,
◆ ఒడిస్సా - 126,
◆ పొద్దుచేరి - 02,
◆ పంజాబ్ - 407,
◆ రాజస్థాన్ - 129,
◆ సిక్కిం - 11,
◆ తమిళనాడు - 288,
◆ త్రిపుర - 17,
◆ ఉత్తర ప్రదేశ్ - 1089,
◆ ఉత్తరాఖండ్ - 19,
◆ వెస్ట్ బెంగాల్ - 528.. మొదలగునవి.
Must read :: JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..
IBPS Clerk 7855 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రమాణాలు:
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో కనీసం 60% డిగ్రీ అర్హతతో.. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి, హిందీ/ ఇంగ్లీష్ మాట్లాడగల సామర్థ్యం అవసరం.
వయో-పరిమితి:
జూలై 1, 2022 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి, రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు చదవండి.
ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్) ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
★ తెలుగు రాష్ట్రాల వారు రాత పరీక్ష తెలుగులో రాసుకునే అవకాశం ఉన్నది.
★ పరీక్ష పేపర్ ఇంగ్లీష్ హిందీ & తెలుగు మాధ్యమాలలో ఉంటుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.850/-
రిజర్వేషన్ వర్గాలవారికి ₹.175/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.07.2022.
అధికారిక వెబ్సైట్: https://www.ibps.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment