WALK-IN-INTERVIEW :: హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జూలై 4 మరియు 5 తేదీల్లో ఇంటర్వ్యూలు..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ, హైదరాబాద్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ & నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఈ క్రింది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా జూలై 4 & 5 తేదీల్లో, తార్నాక మెట్రో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ICMR - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నందు సంబంధిత దరఖాస్తు ఫామ్, మరియు అర్హత ధ్రువపత్రాల కాఫీలతో నేరుగా ఉదయం 09:30 గంటల నుండి హాజరు కావచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీ మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 19.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ జూనియర్ మెడికల్ ఆఫీసర్ - 02,
◆ SRF (ఫుడ్ అండ్ న్యూట్రిషన్) - 05,
◆ SRF (ఆంత్రోపాలజీ/ సోషియాలజీ/ సోషల్ వర్కర్) - 02,
◆ SRF (స్టాటిస్టిక్స్/ బయోస్టాటిస్టిక్స్/ డాటా సైన్స్) - 02,
◆ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 02,
◆ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఫ్లేబొటమిస్ట్) - 02,
◆ ఫీల్డ్ వర్కర్ - 04,
◆ మల్టీ టాస్కింగ్ సర్వీస్ - 02.. మొదలగునవి.
Must read :: JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత అనుభవం కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
ఇంటర్వ్యూ తేదీ నాటికి 25 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు. అధిక వయసు కలిగిన వారికి సడలింపు వర్తిస్తాయి, పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి ₹.15,800 నుండి ₹.60,000 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక:
ICMR - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తార్నాక, హైదరాబాద్, తెలంగాణ.
ఇంటర్వ్యూ తేదీ:
జూలై 4 మరియు 5.
ఇంటర్వ్యూ సమయం:
ఉదయం 09:30 నుండి 11:00 వరకు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తులో డౌన్లోడ్ చేసుకుని సంబంధిత వివరాలతో, పూర్తి చేసుకొని.. అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, నేరుగా జూలై 4 5 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
అధికారిక వెబ్సైట్: https://www.nin.res.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment