TS Guest Lecture Recruitment 2021 | Apply Various posts of subjects | check eligibility creteria and Download application form. @elearningbadi.in
గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.
ప్రధానాచార్యులు ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) మహబూబ్నగర్ కార్యాలయం నుండి గెస్ట్ లెక్చరర్ గా పని చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది పత్రికా ప్రకటన అక్టోబర్ 28, 2021 న విడుదల చేశారు.
విద్యా సంవత్సరం 2021 - 2022 కు గాను ఖాళీగా ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి మరియు రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు & రిటైర్డ్ అయిన డైట్ & బీఈడీ లెక్చరర్ల నుండి దరఖాస్తులను కోరుతూ ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ మహబూబ్నగర్ వారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 12,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సైకాలజీ/ సోషియాలజీ - 2,
2. సైకాలజీ - 1,
3. మ్యాథమెటిక్స్ మరియు పెడగోగి - 2,
4. సోషల్ సైన్స్ మరియు పెడగొగి - 1,
5. ఇంగ్లీష్ - 2,
6. తెలుగు - 1,
7. హెల్త్ మరియు ఫిజికల్ సైన్స్ - 1,
8. విజువల్ ఆర్ట్ & పెర్ఫార్మింగ్ ఆర్ట్ - 1,
9. ఉర్దూ - 1..
విద్యార్హత:
కరికులం సబ్జెక్టులు:
పైన పేర్కొన్న టువంటి సబ్జెక్టు నందు పిజి, డిగ్రీ & ఎంఈడి అర్హత కలిగి ఉండాలి.
ఇతర కరికులం అధ్యక్షులు:
1. హెల్ప్ & ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఎంపీడీవో అర్హత కలిగి ఉండాలి.
2. విజువల్ ఆర్ట్స్ & పెర్ఫార్మింగ్ ఆర్ట్ సబ్జెక్టులలో బిజీ లేదా బ్యాచిలర్ డిగ్రీ నందు ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, డాన్స్, థియేటర్ మొదలగునవి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు & విశ్రాంత ఉపాధ్యాయులు మరియు డైట్ & బీఎడ్ విశ్రాంత ఉపాధ్యాయులు.
సంబంధిత ధ్రువపత్రాల తో అక్టోబర్ 29, 2021 నుండి నవంబర్ 1, 2021లో గా సహా ప్రధాన చార్యులు జిల్లా విద్యా శిక్షణ సంస్థ మహబూబ్నగర్ వారికి సమర్పించాలని.
సందేహాల నివృత్తి కోసం 9949993714 నెంబర్ ను సంప్రదించ గలరని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
💥అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💥ధరఖాస్తు ఫామ్: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్ 29, 2021 నుండి.
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 1, 2021 వరకు.
Comments
Post a Comment