Nursing Officer Recruitment 2021 | Apply 678 Vacancies of Various Hospitals | Check Eligibility Criteria and Online Apply here..
కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
న్యూఢిల్లీలోని సప్దర్ జంగ్ హాస్పిటల్, కళావతి సరన్ చిల్డ్రన్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ మరియు డాక్టర్ రామ్ మనోహర్ కాలేజీలలో ఖాళీగా ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORECT-2021) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఏఐఐఎంఎస్) విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 678.
ఆసుపత్రుల వారీగా ఖాళీల వివరాలు:
1. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ - 31,
2. సప్దర్ జుంగ్ హాస్పిటల్ - 529,
3. కళావతి సరన్ చిల్డ్రన్ హాస్పిటల్ - 29,
4. లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ - 89.. ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి డిప్లమా(జిఎన్ఎం)/ బీఎస్సీ (ఆనర్స్)/ బిఎస్సి(నర్సింగ్) ఉత్తీర్ణత కలిగి, సంబంధిత పనిలో సంవత్సరం అనుభవం ఉండాలి.
మరియు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: అక్టోబర్ 30, 2021 నాటికి 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు అర్హులు.. పూర్తి వివరాలను నోటిఫికేషన్లు చదవండి.
అధికారిక నోటిఫికేషన్, అధికారిక వెబ్సైట్ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్ ఈ పేజీ చివరలో ఉన్నాయి చూడండి.
ఎంపిక ప్రక్రియ: ఈ పోస్టులకు ఎంపికలు రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు.
కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORECT-2021) రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు..
పరీక్ష ప్యాట్రన్:
💧పరీక్ష పేపర్ మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటుంది.
💧మొత్తం 200 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.
💧ఇందులో subject అనుబంధంగా 180 ప్రశ్నలు.
💧జనరల్ నాలెడ్జ్ నుండి 20 ప్రశ్నలు అడుగుతారు.
💧పరీక్ష సమయం 3 గంటలు.
💧నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
💧ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన వారికి pay level 7 ప్రకారం రూ.44,900/- నుండి రూ.1,42, 400/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ.3000/-,
ఎస్సీ ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2500/-.
వికలాంగులకు ఫీజు మినహాయించారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో..👇
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.10.2021, నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.10.2021.
అధికారిక వెబ్సైట్: http://www.vmmc-sjh.nic.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://norcet2021.aiimsexams.ac.in/
Comments
Post a Comment