SJVN Recruitment 2023 | Diploma తో 105 ఉద్యోగాల భర్తీ | Apply Online here..
![]() |
Diploma తో 105 ఉద్యోగాల భర్తీ | Apply Online here.. |
భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వశాఖకు చెందిన ఎస్.జె.వి.ఎన్ లిమిటెడ్, మినీ రత్న క్యాటగిరి-I, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 105 పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థులనుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను 23-01-2023 నుండి 12-02-2023 మధ్య సమర్పించవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, ఎంపిక విధానం మొదలగునవి మీకోసం.
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య :105
విభాగాల వారీగా ఖాళీలు :
✓ జూనియర్ ఫీల్డ్ ఇంజనీర్ లో..
సివిల్ ఇంజనీర్ - 30,
ఎలక్ట్రికల్ ఇంజనీర్ - 35,
మెకానికల్ ఇంజనీర్ - 20..
✓ జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ లో
హెచ్ ఆర్ ఆఫీసర్ - 10,
ఎఫ్ అండ్ ఏ ఆఫీసర్ - 10..
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ / యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్ సిఎ/ ఇంటర్ ఐసిడబ్ల్యూఏ - సిఎంఏ/ గ్రాడ్యుయేషన్/ ఇంజినీరింగ్ డిప్లమా /పీజీ డిగ్రీ/ పీజీ డిప్లమా/ ఎంకామ్ స్పెషలైజేషన్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 % మార్కులు సాధించి ఉండాలి.
ఎంపిక విధానం :
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
వయోపరిమితి :
12-02-2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
గౌరవ వేతనం :
పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.45,000- జీతంగా చెల్లిస్తారు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
హిమాచల్ ప్రదేశ్, చండీగర్, మొహాలీ, డెహ్రాడూన్.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
✓ జనరల్ అభ్యర్థులకు రూ .300/-,
✓ ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 23-01-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 12-02-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://sjvn.nic.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment