TSPSC Senior Assistant Junior Assistant Recruitment 2021‖ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుండి 127 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుండి 127 సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
➥తెలంగాణ యూనివర్సిటీలో అసిస్టెంట్లు.
➥తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్.
పి. వి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ కామ్ టైపిస్ట్ ఉద్యోగాలకు మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వీడియొ చూడండి.
➥దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:12.04.2021
➥దరఖాస్తులకు చివరి తేదీ:05.05.2021
పరీక్ష విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది. పరీక్ష తేదీలను తదుపరి వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సి బి ఆర్ టి) లేదా ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైప్ ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు TSPSC నందు One Time Registration చేసుకొని ఉండాలి. ముందుగానే OTR ను పూర్తి చేసి యున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి TSPSC Login ID మరియు Date of Birth ఆధారంగా లాగిన్ అయి దరఖాస్తులను సమర్పించ వచ్చునని పేర్కొన్నారు.
ముఖ్య గమనిక:
అభ్యర్థులు పేర్కొన్నటువంటి పత్రాలను OTR లో అప్డేట్ చేసుకుని ఉండాలి.
1. ఆధార్ నెంబర్
2. విద్య అర్హత వివరాలు అయినా SSC, Intermediate, degree, Post Graduate మెమోల రోల్ నెంబర్, పాస్టర్ అయినటువంటి సంవత్సరం మొదలగు వివరాలను కలిగి ఉండాలి.
3. కుల ధ్రువీకరణ పత్రం యొక్క ఎన్ రోల్ నెంబర్ మరియు డేటాఫ్ ఇష్యూ తేదీలను OTR లో పేర్కొనాలి.
4. నోటిఫికేషన్ ప్రకారం టెక్నికల్ క్వాలిఫికేషన్ విద్యార్హతలను కలిగి ఉండాలి.
5. పోస్ట్ రిజర్వేషన్ కోసం స్పోర్ట్స్, P. H, ఎస్-Serviceman కోట సర్టిఫికెట్లను కలిగి ఉండాలి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 127 ఉన్నాయి.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సీనియర్ అసిస్టెంట్ ఇన్ పి.వి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ లో మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జీతాల వివరాలు:
➥ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ. 22,460/- నుండి రూ. 66,330/- వరకు.
2. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు ఇన్ పి.వి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ లో మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జీతాల వివరాలు:
➥ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ. 16,400/- నుండి రూ. 49,870/- వరకు.
3. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు ఇన్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ లో మొత్తం 102 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జీతాల వివరాలు:
➥ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ. 16,400/- నుండి రూ. 49,870/- వరకు.
వయస్సు:
➥పై మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01.07.2021 నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
విద్యార్హత:
➥ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీతోపాటు గా కంప్యూటర్ అప్లికేషన్ ఉత్తీర్ణత.
లేదా
➥బి సి ఎ డిగ్రీ ఉత్తీర్ణత.
లేదా
➥కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు గా డిగ్రీ ఉత్తీర్ణత తోపాటు ప్రభుత్వం నిర్వహించిన లోయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
➥రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి.
➥దరఖాస్తు ఫీజు: రూ. 200/- మరియు పరీక్ష ఫీజు రూ. 80/-
పరీక్ష సెంటర్ వివరాలు:
1. హైదరాబాద్
2. కరీంనగర్
3. ఖమ్మం
4. వరంగల్
5. నిజామాబాద్
6. మహబూబ్ నగర్
7. రంగారెడ్డి
8. సంగారెడ్డి
9. నల్లగొండ
10. అదిలాబాద్.
➥అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు వరుసగా ఐదు సెంటర్లను ఎంపిక చేసుకోవచ్చు.
➥అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.tspsc.gov.in/index.jsp
➥అధికారిక నోటిఫికేషన్:👇
Comments
Post a Comment