FCI Recruitment 2021 ‖ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
నోటిఫికేషన్ పూర్తివివరాలకు వీడియొ చూడండి.
నోటిఫికేషన్:
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి అర్హత ఆసక్తిగల అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్(జనరల్ అడ్మినిస్ట్రేషన్) ఈ విభాగంలో మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: సంబంధించిన సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తత్సమాన ఉత్తీర్ణత ను కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01.01.2021 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ. 60,000/- నుండి 1,80,000/- వరకు ఉంటుందని ప్రకటన లో పేర్కొన్నారు.
2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్(టెక్నికల్) ఈ విభాగంలో మొత్తం 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: అగ్రికల్చర్ బీఎస్సీ, బీఈ, బీటెక్ లను AICTE గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01.01.2021 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ. 60,000/- నుండి 1,80,000/- వరకు ఉంటుందని ప్రకటన లో పేర్కొన్నారు.
3. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అకౌంట్) ఈ విభాగంలో మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత:
1. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.
2. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.
3. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా లో మెంబర్ షిప్ పొంది ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01.01.2021 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ. 60,000/- నుండి 1,80,000/- వరకు ఉంటుందని ప్రకటన లో పేర్కొన్నారు.
4. అసిస్టెంట్ జనరల్ మేనేజర్(లా) ఈ విభాగంలో మొత్తం 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఫుల్ టైం లా డిగ్రీ పట్టాను కలిగి ఉండాలి. మరియు న్యాయవాదిగా కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01.01.2021 నాటికి 33 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ. 60,000/- నుండి 1,80,000/- వరకు ఉంటుందని ప్రకటన లో పేర్కొన్నారు.
5. మెడికల్ ఆఫీసర్ ఈ విభాగంలో మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఎంబిబిఎస్ ఉత్తీర్ణత తోపాటు, ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01.01.2021 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ. 50,000/- నుండి 1,60,000/- వరకు ఉంటుందని ప్రకటన లో పేర్కొన్నారు.
రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహించబడుతుంది అని, రాత పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన వారికి మాత్రమే ఇంటర్వ్యూలకు షార్ట్లిస్ట్ చేస్తారని పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 31.03.2021
పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ను చదవండి.
అధికారిక నోటిఫికేషన్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://fci.gov.in/
దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ : https://ibpsonline.ibps.in/
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజును రూ. 1000/-
SC/ST/PwBD మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. వీరికి ఫీజు మినహాయింపు వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
పరీక్ష సెంటర్: తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కు
1. ఆంధ్రప్రదేశ్ వారికి అమరావతి/ విజయవాడ
2. తెలంగాణ వారికి హైదరాబాదు ను పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించారు.
Comments
Post a Comment