NMDC Junior Managers Recruitment 2021‖ హైదరాబాద్ లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నుండి జూనియర్ మేనేజర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
హైదరాబాద్ లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నుండి వివిధ విభాగాల్లో జూనియర్ మేనేజర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది.
ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు 14 ఉన్నవి.
విభాగాల వారీగా ఖాళీలు:
➥ వైనాన్స్ లో 6,
➥ సివిల్ లో 3,
➥ ఎన్విరాన్మెంట్ లో 2,
➥ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో 1,
➥ రాజభాష లో 1,
➥ లా లో 1 ఖాళీలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Kendriya Vidyalaya Mahabubabad Teaching Staff Recruitment ‖ కేంద్రీయ విద్యాలయం, మహబూబాబాద్ టీచర్ పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూల కు నోటిఫికేషన్ విడుదలింది. ఇంటర్వ్యూ తేదీలను తెలుసుకోండి..
జూనియర్ మేనేజర్ల కు అర్హత వివరాలు:
➥ పైనాన్స్ విభాగానికి సీఏ/ ఐసీడబ్యుఏఐ/ ఎంబీఏ
(ఫైనాన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. మరియు వైనాన్స్ అండ్ అకౌంటింగ్ లో రెండేళ్ల అనుభవం ఆవసరం.
➥ సివిల్ విభాగానికి బిఈ/ బీటెక్(సివిల్),
➥ ఎన్విరాన్మెంట్ కు డిగ్రీ (సివిల్/ కెమికల్/ మైనింగ్/ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్)లేదా పీజీ (ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్/ఎన్విరాన్మెంటల్ సైన్స్/ జియాలజీ/ కెమిస్ట్రీ/బోటనీ) లేదా పీజీ డిప్లొమా (ఎన్విరాన్మెంటల్ మేనేజ్ మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.
➥ ఐఈకి డిగ్రీ (మైనింగ్/ మెకానికల్/ ప్రొడక్షన్) ఉండాలి.
➥ రాజభాషకు యంఏ (హిందీ)
➥ లా విభాగానికి ఎల్‌ఎల్‌బి ఉత్తీర్ణత ఆవసరం.
అన్ని పోస్టులకూ సంబంధిత రంగంలో
కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఆకడమిక్ ప్రతిభ, ఆనుభవం ఆధారంగా
షార్ట్ లిస్ట్ చేసి 1:5 నిష్పత్తిలో ఆన్లైన్
టెస్టుకు అనుమతిస్తారు. ఇందులో అర్హత పొందినవారిని 1.8 నిష్పత్తిలో ఎంపిక చేసి
ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆన్లైన్ టెస్టు, ఇంటర్వ్యూలకు 85:15 నిష్పత్తిలో
వెయిటేజీ ఇస్తారు. ఆన్లైన్
టెస్టును హిందీ, ఇంగ్లీషు మాధ్యమాల్లో నిర్వహిస్తారు. తరవాత దృవపత్రాల
పరిశీలన ఉంటుంది. ఈ విధంగా ఎంపిక విధానం
ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ముఖ్య సమాచారం
➥ దరఖాస్తు ఫీజు: రూ.500
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 22.03.2021 నుండి.
➥ ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.04.2021
➥ హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ: 27.04.2021
➥ చిరునామా: పోస్ట్ బాక్స్ నెం. 1853, పోస్ట్ఆఫీస్, హుమయూన్ నగర్, హైదరాబాద్ – 500028.
అదికారిక వెబ్ సైట్: www.nmdc.co.in
అదికారిక నోటిఫికేషన్: ఇక్కడ క్లిక్చేయండి.
ఇది కూడా చదవండి: HMT Machine Tools Ltd. ITI/Diploma (Trainee) Recruitment || హెచ్ఎంటీ కంపెనీలో ఐటిఐ/ డిప్లామా క్యాడర్లో ట్రైనీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ:10.04.2021
Comments
Post a Comment