HMT Machine Tools Ltd. ITI/Diploma (Trainee) Recruitment || హెచ్ఎంటీ కంపెనీలో ఐటిఐ/ డిప్లామా క్యాడర్లో ట్రైనీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
హెచ్ఎంటీ మెషిన్ టూల్స్ లిమిటెడ్ నుండి వర్క్ మెన్ క్యాటగిరి లో కంపెనీ ట్రైనీలు నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఐటిఐ, డిప్లామా క్యాడర్లో ట్రైనీల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 21 ఉన్నాయి.
విభాగాల వారీగా పోస్టులు, మరియు విద్యార్హత వివరాలు:
1. ఐటిఐ ట్రైనీ లో మొత్తం 14 పోస్టులు ఉన్నాయి.
విభాగాలు: టర్నర్, మెషినిస్ట్, గ్రిండర్, ఫిట్టర్, ఫాండ్రిమన్, ప్లంబర్ ట్రేడ్ లో ఖాళీలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: BITS Pilani Admissions ‖ ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు నిర్వహించే బిట్‌శాట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. దరఖాస్తులకు చివరి తేదీ: 29.05.2021
విద్యార్హత: ఎన్ సి వి టి (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ఒకేషనల్) గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్ లో కనీసం 60 శాతం మార్కులతో ఐటిఐ కోర్స్ ను పూర్తి చేసి ఉండాలి.
మెషిన్ టూల్స్ ఇండస్ట్రీ, మల్టి స్కిల్స్ ఆపరేషన్స్ లో అనుభవం అవసరం.
శిక్షణ వ్యవధి: మూడు సంవత్సరాలు.
స్టయి ఫెండ్:
మొదటి సంవత్సరం నెలకు రూ. 13,000/-
రెండవ సంవత్సరం నెలకు రూ. 13,500/-
మూడవ సంవత్సరం నెలకురూ. 14,000/- ప్రతి నెలా చెల్లిస్తారు.
ఇది కూడా చదవండి: Kendriya Vidyalaya Mahabubabad Teaching Staff Recruitment ‖ కేంద్రీయ విద్యాలయం, మహబూబాబాద్ టీచర్ పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూల కు నోటిఫికేషన్ విడుదలింది. ఇంటర్వ్యూ తేదీలను తెలుసుకోండి..
2. డిప్లామా ట్రైనీ లో మొత్తం 7 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మూడేళ్ల డిప్లామా కోర్సు (మెకానికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
సంబంధిత విషయంలో సంస్థలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
మెషిన్ టూల్స్ కు సంబంధించిన పరిజ్ఞానం అవసరం.
శిక్షణ వ్యవధి: రెండు సంవత్సరాలు.
స్టయి ఫెండ్:
మొదటి సంవత్సరం నెలకు రూ. 13,500/-
రెండవ సంవత్సరం నెలకు రూ. 14,000/- ప్రతి నెలా చెల్లిస్తారు.
ఇది కూడా చదవండి: NMDC Junior Managers Recruitment 2021‖ హైదరాబాద్ లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నుండి జూనియర్ మేనేజర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.04.2021
ఎంపిక ప్రక్రియ: మెరిట్, అనుభవం, అర్హతల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఈ ఎంపిక ప్రక్రియ రెండు దశలలో ఉంటుంది.
1. స్కిల్ టెస్ట్: అభ్యర్థి స్కిల్స్ ను పరీక్షించేందుకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇది 70 మార్కులకు ఉంటుంది.
2. రాత పరీక్ష: ఇందులో ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇది 30 మార్కులకు ఉంటుంది.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.03.2021 నాటికి 33 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ. 500/-
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ. 250/-
దివ్యాంగులకు ఫీజు లేదు.
ఇది కూడా చదవండి: FCI Recruitment 2021 ‖ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 31.03.2021
దరఖాస్తులకు చివరి తేదీ:10.04.2021
చిరునామా: హెచ్ఆర్ చీప్, హెచ్ఎంటీ మెషిన్ టూల్ లిమిటెడ్, హెచ్ఎంటి కాలనీ పోస్ట్, ఎర్నాకులం, కేరళ - 683503.
అధికారిక వెబ్ సైట్ లింక్: http://www.hmtindia.com/
నోటిఫికేషన్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment