BITS Pilani Admissions ‖ ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు నిర్వహించే బిట్‌శాట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఇంజినీరింగ్
కోసం ఐఐటీ,
ఎన్ఐటీ,
ఐఐఐటీల తర్వాత
ఎక్కువ
మంది స్టూడెంట్స్
బిర్లా
ఇన్స్టిట్యూట్
ఆఫ్ టెక్నాలజీ
అండ్ సైన్స్(బిట్స్)
వైపు చూస్తుంటారు.
అలాంటి
ఇన్స్టిట్యూట్
2021-22 అకడమిక్
ఇయర్ ఇంటిగ్రేటెడ్
ఫస్ట్ డిగ్రీ
ప్రోగ్రామ్స్‌లో
ప్రవేశాలకు
నిర్వహించే బిట్‌శాట్
2021 నోటిఫికేషన్
రిలీజ్
చేసింది.
బిట్స్ ను బిర్లా గ్రూప్ చైర్మన్ జి.డి.బిర్లా ఏర్పాటు చేశారు. మొదట ఇంజినీరింగ్, హ్యూమానిటీస్, ఫార్మసీ, సైన్స్ విద్యతో ప్రత్యేక కాలేజీలు ప్రారం భించిన బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ 1964లో అన్నిం టిని కలిపి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేసింది. అదే సంవత్సరంలో డీమ్డ్ యూ నివర్శిటీ హోదా పొందిన బిట్స్ కు యూజీసీ, న్యాక్, ఏయూసీ, పీసీఐ వంటి సంస్థల గుర్తింపు ఉంది. బిట్స్ హెడ్ క్వార్టర్స్ పిలాని కాగా గోవా, హైదరా బాద్, దుబాయ్ లో క్యాంపస్లున్నాయి.
కోర్పులు:
బిట్స్ లో ఫస్ట్ డిగ్రీ, పీజీ, డాక్టోరల్, అడ్వాన్స్డ్ వంటి దాదాపు 30కి పైగా ప్రోగ్రాములు అందుబా టులో ఉన్నాయి. వీటిలో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ, బయోటెక్నాలజీ), బీఫార్మసీ, ఎంఎస్సీ (బయాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్), ఎంఎస్సీ (జనరల్ స్టడీస్) వంటి కోర్సులు న్నాయి. అలాగే మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎంఫా రృసీ, ఎంఫిల్, ఎంబీఏ వంటి పీజీ ప్రోగ్రాములు, దాదాపు ఇవే సబ్జెక్టుల్లో పీహెచ్డీ చేసే అవకాశమూ ఉంది.
టాపర్స్కు
డైరెక్ట్
అడ్మిషన్:
దేశంలోని ఏదైనా బోర్డు ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్దులకు బిట్శాట్ స్కోర్ తో సంబంధం లేకుండా నేరుగా వారు కోరుకు న్న కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. అయితే సంబంధిత కోర్సు ఎలిజిబిలిటీ కండిషన్స్ పుల్‌ఫిల్ చేయాల్సి ఉంటుంది.
సెలెక్షన్
ప్రాసెస్:
బిట్శాట్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా అడ్మిషన్లు తీసు కుంటారు. టెస్ట్ లో 450మార్కులకు 150 ప్రశ్నలి స్తారు. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు.
టెస్ట్
ప్యాటర్న్:
పార్ట్1. ఫిజిక్స్ నుండి 40 ప్రశ్నలకు 120 మార్కులు
పార్ట్-2. కెమిస్ట్రీ నుండి 40 ప్రశ్నలకు 120 మార్కులు
పార్ట్-3. ఎ) ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ 15 ప్రశ్నలకు 45 మార్కులు
బి) లాగికల్ రీజనింగ్ నుండి 10 ప్రశ్నలకు 30 మార్కులు
పార్ట్-4. మ్యాథ్స్లేదా బయాలజీ 45 ప్రశ్నలకు135 మార్కులు నుండి
మొత్తం 150 ప్రశ్నలు 450 మార్కులు
అర్హత:
ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ ఫస్ట్ డిగ్రీప్రోగ్రామ్కు 10+2 విధానంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాధమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉందాలి. బీఫార్మసీకి బయాలజీ లేదా మ్యాధమెటి క్స్ చేసిన వారు అర్హులు. ఒక్కో సబ్బెక్టులో కనీసం 60 శాతం మార్కులు సాధించడమే కాకుండా ఓవరాల్గా 75శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. 2020లో పాసైన లేదా 2021 మే నెలలో పరీక్ష రాయబోతున్న స్టూడెంట్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా బిట్స్ క్యాంపస్ లో ఇతర కోర్సుల్లో చదువుతున్నవారు కూడా అనర్హులు.
దరఖాస్తు ఫీజు: పురుషులు రూ.3400, మహిళలు రూ.2900 చెల్లించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 29.05.2021
పరీక్ష స్లాట్
బుకింగ్: 04.06.2021 నుండి
పరిక్ష తేదీ: 24.06.2021 నుండి 30.06.2021 వరకు
అదికారిక
వెబ్ సైట్ లింక్
: https://www.bitsadmission.com/
ఇది కూడా చదవండి: Kendriya Vidyalaya Mahabubabad Teaching Staff Recruitment ‖ కేంద్రీయ విద్యాలయం, మహబూబాబాద్ టీచర్ పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూల కు నోటిఫికేషన్ విడుదలింది. ఇంటర్వ్యూ తేదీలను తెలుసుకోండి..
Comments
Post a Comment