NPCIL Executive Trainees Recruitment 2021: బీటెక్ పూర్తి చేసిన వారికి శుభవార్త! (NPClL) లో 200 ట్రైయినీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు..
బీటెక్ పూర్తి చేసిన వారికి శుభవార్త!.
ఎన్ పీ సీ ఐ ఎల్ (NPClL) లో 200 ట్రైయినీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
జీతం : 55,000/-.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల:
ముంబై ప్రధాన కేంద్రంగా గల కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
నోటిఫికేషన్ వివరణ మరియు దరఖాస్తు చేసుకునే విదానం కోసం వీడియొ చూడండి:
నోటిఫికేషన్:
NPCIL ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు నియామకం (2020) గేట్ 2018/2019/2020 ద్వారా..
ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీలు 200.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి విద్యార్హత:
➨ B.E/ B.Tech/ B.Sc (ఇంజనీరింగ్) లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ M.Tech. సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా AICTE చేత గుర్తించబడిన ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. మరియు గేట్ 2018/ 2019/ 2020 వ్యాలీడ్ స్కోర్ ను కలిగి ఉండాలి.
➨ ప్రస్తుతం చివరి సెమిస్టర్ లేదా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: అభ్యర్థుల వయస్సు 20.04.2020నాటికి 26 సంవత్సరాలకు మించకూడదు.
➨ రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
➨ పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ ను చదవండి.
ముఖ్య సమాచారం:
➨ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.02.2021
➨ ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ: 09.03.2021
దరఖాస్తు ఫీజు:
➨ General, OBC, EWS వర్గాలకు చెందిన పురుష అభ్యర్థులకు మాత్రమే రూ. 500/-
➨ SC, ST, PWbD, Ex-serviceman మహిళా అభ్యర్థులు మరియు NPCIL ఉద్యోగులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. వీరికి ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ నాలుగు (4) దశలను కలిగి ఉంటుంది.
1. రిజిస్ట్రేషన్,
2. ఈమెయిల్ ఐడి యాక్టివేషన్,
3. అడ్రస్ ప్రూఫ్ తో అప్లికేషన్ పూర్తి చేయడం,
4. ఆన్లైన్లో ఫీజు చెల్లించడం,
5. చివరిగా యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయ్యి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడం.
ఎంపిక విధానం:
➨ గేట్ 2018/ 2019/ 2020 లో సాధించిన మార్కుల ఆధారంగా దరఖాస్తుదారులను 1:12 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
➨ అభ్యర్థులకు ఒక సంవత్సరంపాటు ఓరియంటేషన్ ట్రైనింగ్ నిర్వహిస్తారు.
➨ ట్రైనింగ్ కాలంలో అభ్యర్థులకు స్టైపెండ్ రూపంలో జీతం ఇవ్వడం జరుగుతుంది.
➨ ప్రతి నెల రూ. 55,000/- రూపాయలు చెల్లిస్తారు.
➨ మరియ Ons Time Book Allowance రూ. 18,000/- చెల్లిస్తారు.
➨ విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి సంబంధిత విభాగాలలో పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.
అధికారిక వెబ్సైట్: npcilcareers.co.in
అధికారిక నోటిఫికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తులు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Post a Comment