TSHC JOBs 2022 | డిగ్రీ పాస్ అయ్యారా! ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి..
నిరుద్యోగులకు శుభవార్త!
ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హతతో రాష్ట్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈనెల 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్లను సెప్టెంబర్ 5వ తేదీ నుండి అందుబాటులో ఉంచనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అలాగే రాతపరీక్ష సెప్టెంబర్ 25న నిర్వహిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినా; మొత్తం ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
తెలంగాణ ఆంధ్ర & భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
ఖాళీల వివరాలు:
పోస్ట్ పేరు: టైపిస్ట్ మరియు కాపీస్ట్
మొత్తం పోస్టుల సంఖ్య :85
విభాగాల వారీగా ఖాళీలు:
◆ టైపిస్ట్ విభాగంలో - 43,
◆ కాపీస్ట్ విభాగంలో - 42.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ(ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్ & లా) ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ప్రభుత్వ టైప్ రైటింగ్ టెక్నికల్ పరీక్ష హయ్యర్ ఇంగ్లీష్ లో నిమిషానికి 45 పదాలు టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
జూలై 1 2022 నాటికి 18 నుండి ముప్పై నాలుగు సంవత్సరాలకు మించకుండా ఉండాలి అలాగే రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దిగువ యున్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
ఎంపిక విధానం:
ఉమ్మడి ప్రవేశ పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
ఈ తెలంగాణ హై కోర్ట్ టైపిస్టు మరియు కాపీ ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ₹.24,280/- నుండి ₹.72,850/-వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.800/-.
రిజర్వేషన్ వర్గాలవారికి ₹.400/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.08.2022.







అధికారిక వెబ్సైట్: https://tshc.gov.in/
వివరణాత్మక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment