EMRS 6th Class Admission Test Notification 2022-23 | తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆరవ తరగతి సీబీఎస్ఈ ప్రవేశాలకు ప్రకటన.. పూర్తి వివరాల తో, దరఖాస్తు విధానం ఇక్కడ.
విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్, విద్యా సంవత్సరం (2022-23) కు గాను, CBSE-సిలబస్ ఆరవ తరగతి ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది.
నోటిఫికేషన్ పూర్తి వివరణ వీడియోలో
◆ అర్హత ప్రమాణాలు:
● ప్రస్తుత విద్యా సంవత్సరం, (2021-22) లో ఐదవ తరగతి చదువుతున్న వారే ఉండాలి.
◆ వయసు:
● విద్యార్థుల వయసు 10 నుండి 13 సంవత్సరాలకు మించకూడదు, వికలాంగుల అయితే 10 నుండి 15 సంవత్సరాలు ఉండాలి.
● తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఆర్థిక సంవత్సరం (2022-23) కు గాను, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 2,00,000/- మించకుండా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 1,50,000/- మించకుండా ఉండాలి.
తప్పక చదవండి :: పదోతరగతి అర్హతతో 2788 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఆన్లైన్ దరఖాస్తుల కు చివరి తేదీ మార్చి1 2022 | నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
● విద్యా హక్కు చట్టం 2009, చాప్టర్-II, సెక్షన్-4 ప్రకారం ఐదవ తరగతిలో పాఠశాలకు హాజరు కాని విద్యార్థులు కూడా ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హులు. అయితే తల్లిదండ్రులు సంబంధిత విషయంపై డెకరేషన్ సమర్పించాలి.
● సేల్ప్ డిక్లరేషన్ ఫామ్, అధికారిక నోటిఫికేషన్, అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్స్ ఈ పేజి చివర లో ఉన్నాయి చూడండి.
● దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మెరిట్ ప్రకారం సీట్లు కేటాయించడానికి (05) ఆప్షన్స్ లను నమోదు చేయాలి. అయితే ప్రయారిటీ ప్రకారం 23 ఆప్షన్లను నమోదు చేయవలసి ఉన్నది, లేనియెడల అప్లికేషన్ సబ్మిట్ కాదు. కాబట్టి విద్యార్థులు 1 నుండి 23 వరకు అన్నీ EMRS లకు ఆప్షన్ ఇవ్వగలరు.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం ఈ వీడియో చూడండి.
◆ ఎంపిక విధానం:
● EMRS ఆరవ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ఎంపికలు రాత పరీక్ష ఆధారంగా ఉంటాయి.
● రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
● ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ఆఫ్ లైన్ రూపంలో ఉంటుంది.
● మొత్తం మూడు భాగాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
◆ మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు,
◆ అర్థమెటిక్ నుండి 25 ప్రశ్నలు,
◆ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు అడుగుతారు.
తప్పక చదవండి :: డిగ్రీ విద్యార్హతతో 445 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
● దరఖాస్తు విధానం:
● దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
● ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.02.2022 నుండి,
● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.02.2022.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 23 EMRSలల్లో 1380 సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. పాఠశాల నుండి బాలికలు-30, బాలురు-30 మొత్తం-60. ఈ విధంగా భర్తీ చేస్తారు.
● ఈ అవకాశాన్ని ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను.
అధికారిక వెబ్సైట్: https://telanganaemrs.in/
అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: http://mmtechies-001-site4.itempurl.com/start.html
సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్: డౌన్లోడ్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment